సూపర్ స్టార్ కృష్ణ 1961లో వచ్చిన కులగోత్రాలు సినిమాతో నటనా ప్రస్థానాన్ని ప్రారంభించారు. పదండి ముందుకు, పరువు ప్రతిష్ట సినిమాల్లో చిన్న పాత్రలతో యాక్టర్‌గా కెరీర్ మొదలుపెట్టారు. ఆ తర్వాత 1965లో తేనె మనసులు చిత్రంలో హీరోగా అవకాశం దక్కింది. ఐదు దశాబ్దాల సినీ కెరీర్‌లో 370కి పైగా చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి..సూపర్ స్టార్‌గా, నటశేఖరుడిగా చెరగని ముద్రవేసుకున్నారు. గూఢచారి 116తో కృష్ణ కెరీర్‌కు గట్టి పునాదిలాంటి. ఒకే ఏడాది అత్యధిక చిత్రాల్లో నటించిన కృష్ణ. తెలుగునాట విశేషాదరణ పొందిన హీరో ఆయన. 1983లో విజయవాడలో ఆరు చిత్రాలు శతదినోత్సవం జరుపుకున్నాయి. ఆయన నటించిన 20 చిత్రాలు డబ్ అయ్యాయి. మరో పదో చిత్రాలు హిందీలోకి డబ్ అయ్యాయి.కృష్ణ 16 సినిమాలకు దర్శకత్వం వహించారు. 1972లో కృష్ణ అత్యధికంగా నటించిన 18 సినిమాలు విడుదలయ్యాయి. సూపర్ కృష్ణతో నటించిన 50 మంది మల్లీస్టార్లతో కలిసి నటించారు. 105 మంది దర్శకులతో నటశేఖర కృష్ణతో కలిసి పని చేశారు. 52 సంగీత దర్శకులతో పని చేశారు. 1965 నుంచి 2009 వరకు 44 సంవత్సరాల పాటు గ్యాప్ లేకుండా నటించిన ఏకైక హీరో కృష్ణ. సంక్రాంతి రోజు కృష్ణ నటించిన సినిమాలు 30 విడుదలయ్యాయి. కృష్ణ తొలిసారి దర్శకత్వం వహించిన సింహాసనం సినిమా 153 థియేటర్లలో విడుదలైంది. కృష్ణ, జయప్రద కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు 43. కృష్ణ, శ్రీదేవి కాంబినేషనల్‌లో వచ్చిన సినిమాలు 31 కాగా.. సూపర్ స్టార్ కృష్ణతో నటించిన హీరోయిన్ల సంఖ్య 80. 25 చిత్రాల్లో నటశేఖరుడు ద్విపాత్రాభినయం చేశారు. దర్శకుడు, నిర్మాత, స్టూడియో అధినేతగా బహుముఖ కృషి చేయడంతో పాటు తెలుగు సినిమాకు సరికొత్త టెక్నాలజీని పరిచయం చేశారు.