9010892345 Whatsup moviepromotion.pro@gmail.com
Select Page
డర్టీ ఫెలో మూవీ ఫస్ట్ లుక్ ను ఆవిష్కరించిన దర్శకుడు నక్కిన త్రినాథ్ రావు

డర్టీ ఫెలో మూవీ ఫస్ట్ లుక్ ను ఆవిష్కరించిన దర్శకుడు నక్కిన త్రినాథ్ రావు

రాజ్ ఇండియా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై శాంతి చంద్ర, దీపిక సింగ్, మిస్ ఇండియా 2019 శిమ్రితీ బతీజా, నిక్కిషా రంగ్ వాల హిరో హీరోయిన్లుగా, ఆడారి మూర్తి సాయి డైరెక్షన్ లో, జీ ఎస్ బాబు నిర్మిస్తున్న చిత్రానికి డర్టీ ఫెలో అనే టైటిల్ ను ఖరారు చేసింది చిత్ర యూనిట్.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా కార్యక్రమంలో దర్శకుడు నక్కిన త్రినాథ్ రావు టైటిల్ ఫస్ట్ లుక్ ను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో దర్శకుడు వీర శంకర్, మ్యూజిక్ డైరెక్టర్ డాక్టర్ సతీష్, హిరో శాంతి చంద్ర, హీరోయిన్ శిమ్రితీ బతీజా, చిత్ర దర్శకుడు ఆడారి మూర్తి సాయి , నటుడు కుమరన్ తదితరులు పాల్గొన్నారు

డైరెక్టర్ నక్కిన త్రినాథ్ రావు మాట్లాడుతూ; మోషన్ పోస్టర్ బాగుంది .టైటిల్ విషయంలో ఎక్కువ కాన్సంట్రేట్ చేసి జనాలకు రిచ్ అయ్యేలా వుండాలి..ఆ విధంగా ఈ డర్టి ఫెలో టైటిల్ ఈ కథ కీ యాప్ట్. హీరో శాంతి చంద్ర కొన్ని సినిమాల లో నటించారు. ఫైర్ వున్న నటుడు. సినిమా పట్ల ఫ్యాషన్ తో ఎంతో డెడికేటెడ్ గా వర్క్ చేస్తాడు..ఈ సినిమా లో తన లుక్ సుపర్బ్. దర్శకుడు మూర్తి సాయి గారు తన పంథా మార్చుకొని డాన్ సినిమాని తెరకెక్కించారని అనుకుంటున్నాను. మోహన్ రావు కి ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి మరిన్ని సినిమాలు చెయ్యాలి అన్నారు

హిరో శాంతి చంద్ర మాట్లాడుతూ; ఈ మూవీ స్టార్ చేయడానికి ముఖ్య కారకుడు దర్శకుడు మూర్తి సాయి..అతను వచ్చి ఈ సినిమా గురించి చెప్పాడు. 2010 నుంచి సినిమా ఇండస్ట్రీకి దూరంగా వున్నాను..దర్శకుడు మూర్తి సాయి, కెమెరా మెన్ రామకృష్ణ ఇద్దరు వర్క్ చూసి వీళ్ళు కదా నాకు కావాలి అనుకొని సినిమా పట్ల ప్రేమ పెరిగింది. అలాగే డాక్టర్ సతీష్ గారు సహకారం మరువలేను.. అరకు, వైజాగ్, హైదరాబాద్ లో సినిమా షూటింగ్ చేసాము. మాకు బలమైన నమ్మకం ఈ సినిమా కథ..ఒక తండ్రి తనకొడుకునీ సరైన మార్గంలో పెట్టకపోతే ఆ కొడుకు విచ్చల విడిగా సమాజానికి హానికరంగా మారితే… ఆ తండ్రి తీసుకొనే నిర్ణయం ఏమిటి…తండ్రి కొడుకుల మధ్య జరిగే యాక్షన్ డ్రామా. హీరోయిన్స్ ఇద్దరు బాగా నటించారు. ఈ సినిమా లో నటించిన నటి నటులు టెక్నిషియన్స్ కు ధన్యవాదములు అని అన్నారు.

చిత్ర దర్శకుడు ఆడారి మూర్తి సాయి మాట్లాడుతూ: ప్రేక్షకులు మెచ్చే అన్ని అంశాలు మా కథలో వున్నాయి. హీరో శాంతి చంద్ర డాక్టర్ సతీష్ గారు సహకారం మరువలేను.మేము పిలవగానే మా ప్రయత్నాన్ని ఆశీర్వదించడానికి వచ్చిన దర్శకులు వీర శంకర్ గారు, నక్కిన త్రినాథ్ రావు గారు కు థాంక్స్ అన్నారు

దర్శకుడు వీర శంకర్ మాట్లాడుతూ: దర్శకుడు మూర్తి సాయి నాకు మంచి మిత్రుడు. హీరో శాంతి చంద్ర కూడా చాలాకాలం నుంచి తెలుసు. మంత్ర, 3, దహనం సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కథ మీద నమ్మకంతో ఎక్కడ రాజీ పడకుండా సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా కి డర్టీ ఫెలో అనే టైటిల్ కరెక్ట్ గా సరిపోతుంది మంచి కథ కథనంతో వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొందాలని కోరుకుంటున్నాను అన్నారు

హీరోయిన్ శిమ్రితీ బతీజా మాట్లాడుతూ: నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాత లకు థాంక్స్, ఈ మూవీ లో ఒక మంచి క్యారెక్టర్ లో నటించాను. అన్ని ఎమోషన్స్ వున్న క్యారెక్టర్ నాది అని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ డాక్టర్ సతీష్ మాట్లాడుతూ: నేను స్వతహాగా డాక్టర్ నీ సినిమాలు అంటే ఫ్యాషన్ తో ఈ సినిమాకు మ్యూజిక్ అందించాను. హిరో దర్శకుడు ఇద్దరు నాకు మంచి మిత్రులు. వాళ్లిద్దరూ ఎంతో డెడికేటెడ్ గా. ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ డర్టీ ఫెలో సినిమా అందరి మన్ననలు పొందాలని కోరుకుంటున్నాను అని అన్నారు….

నటి నటులు: శాంతిచంద్ర, దీపిక సింగ్, శిమ్రితీ బతీజా,
నిక్కిషా రంగ్ వాల హిరో హీరోయిన్లుగా నటించగా సత్యప్రకాస్, నాగి నీడు, ఎఫ్ ఎమ్ బాబాయ్, కుమరన్, రాచకొండ జయశ్రీ, నిఖేష్, టి రవి తదితర ముఖ్య పాత్రల్లో నటించారు

ఎడిటర్: జేపీ
ఫైట్స్: శంకర్
మ్యూజిక్: డాక్టర్ సతీష్
డాన్స్; కపిల్ అండ్ ఈశ్వర్
సినిమాటోగ్రఫీ: ఎస్ రామకృష్ణ,
ప్రొడ్యూసర్; జీ ఎస్ బాబు
డైరెక్టర్;. ఆడారి మూర్తి సాయి

రైతుల తిరుగుబాటు ముఖ్య నేపథ్యంలో నాగలి

రైతుల తిరుగుబాటు ముఖ్య నేపథ్యంలో నాగలి

1995లో తపస్సు అనే సినిమాలో నటించిన ప్రముఖ దర్శకుడు భరత్ పారేపల్లి మళ్లీ 27 సంవత్సరాల తరువాత ప్రముఖ పాత్రలో ఒక రైతుగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో ది డ్రీమ్స్ కంపెనీ బ్యానర్ పై శ్రీమతి పావని మొక్కరాల సమర్పణలో నాగలి అనే సినిమా తెరకెక్కించారు. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సందర్భంగా దర్శకుడు భరత్ పారేపల్లి మాట్లాడుతూ….“ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో నూతన నటీనటులతో చిత్రీకరణ జరిపాము. నూతన కథానాయకుడు సుదీప్ మొక్కరాల నిడదవోలు, కథానాయకి అనుస్మతి సర్కార్ ముంబాయి, హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో నాలుగు పాటలు ఎంఎల్ రాజా సంగీత సమర్పణలో జరిగాయి. రైతుల ఆత్మహత్యలు… వాళ్ళ కథలు , వెతలు కలయబోసిన 1857, 58ల మధ్య జరిగిన సిపాయిల తిరుగుబాటును తలపించేలా ఇప్పుడు రైతుల తిరుగుబాటు ముఖ్య నేపథ్యంతో ఈ సినిమా చేసాము. ఇందులో ఛాలెంజింగ్ పాత్రలో నటిస్తూ నిర్మించాను. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో నెల రోజులు నిర్వి విరామంగా షూటింగ్ పూర్తిచేసుకుని, ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. జనవరిలో ఆడియో విడుదల చేసి ఫిబ్రవరిలో సినిమా రిలీజ్ చేయడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
భరత్ పారేపల్లి, సత్య ప్రసాద్ రొంగల, మోహన్ రావు వల్లూరి, కావేరి, మధు బాయ్, వాసు వర్మ, నాని తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి కో డైరెక్టర్ – నాని జంగాల, పిఆర్ఓ: కుమార్ స్వామి, మాటలు ,పాటలు – పెద్దాడ మూర్తి, సినిమాటోగ్రఫీ – వాసు వర్మ కఠారి, నిర్మాతలు – భరత్ పారేపల్లి , సుదీప్ మొక్కరాల, కధ-స్క్రీన్ ప్లే -దర్శకత్వం – భరత్ పారేపల్లి

‘ధర్మచక్రం’ ఫస్ట్ లుక్ విడుదల..

‘ధర్మచక్రం’ ఫస్ట్ లుక్ విడుదల..

సంకేత్ తిరుమనీడి, మౌనిక చౌహాన్ జంటగా పద్మ నారాయణ ప్రొడక్షన్ బ్యానర్ లో నాగ్ ముంతా దర్సకత్వం లో తెరకెక్కిస్తున్న సినిమా ధర్మచక్రం. సందేశాత్మక కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. తాజాగా “ధర్మచక్రం” ఫస్ట్ లుక్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. దీనికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఆనంద్ మరుకుర్తి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు.. ప్రణయ్ రాజపూటి సంగీతం అందిస్తున్నారు.

దర్శకుడు నాగ్ ముంతా మాట్లాడుతూ.. ‘ ధర్మచక్రం మెసేజ్ ఓరియెంటెడ్ గా తెరకెక్కిస్తున్నాము. సమాజంలో ఆడవాళ్ళపై జరుగుతున్న అఘాయిత్యాలు, ఆకృత్యాల నేపథ్యంలోనే ఈ చిత్ర కథ ఉంటుంది. అమ్మాయిల స్వీయ రక్షణ ఎలా ఉండాలో ఈ సినిమాలో చూపిస్తున్నాము. హీరోయిన్ మోనిక చౌహన్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే ఈ చిత్రం విడుదల తేదీ అనౌన్స్ చేస్తాము..’ అని తెలిపారు.

నటీనటులు:

సంకేత్ తిరుమనీడి, మౌనిక చౌహాన్, చైతన్య, ప్రవీణ్ కుమార్, ధృవ, జానీ ఫీవర్ మైలవరం, నరసింహా రావు తదితరులు..

టెక్నికల్ టీమ్:

దర్శకుడు: నాగ్ ముంతా
నిర్మాత: జిపి రెడ్డి
సినిమాటోగ్రఫర్: ఆనంద్ మరుకుర్తి
సంగీతం: ప్రణయ్ రాజపూటి
యాక్షన్: హంగామా కృష్ణ బమ్మిడి
పి ఆర్.ఓ : లక్ష్మీ నివాస్

నిజ జీవితంలోనూ గోపీలానే ఉంటాను.. ‘మసూద’ విజయంపై హీరో తిరువీర్

నిజ జీవితంలోనూ గోపీలానే ఉంటాను.. ‘మసూద’ విజయంపై హీరో తిరువీర్

ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ‘మళ్ళీ రావా’, థ్రిల్లర్ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విభిన్న కథలతో బ్లాక్‌బస్టర్ విజయాలను అందుకున్న స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌‌లో రూపుదిద్దుకున్న మూడో చిత్రం ‘మసూద’. సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, బాంధవి శ్రీధర్, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాశ్, సత్యం రాజేష్ తదిరులు ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రంతో సాయికిరణ్‌ని దర్శకుడిగా పరిచయం చేశారు నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా. నవంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదలై నేటికీ విజయవంతంగా దూసుకుపోతోంది. ఈ సంద్భంగా హీరో తిరువీర్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే…

పరేషాన్ సినిమా చేస్తున్న సమయంలో మసూద గురించి తెలిసింది. సినిమాటోగ్రఫర్ జగదీష్ చీకటి ద్వారా ఈ సినిమా గురించి నాకు తెలిసింది. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లో సినిమా ఆఫర్ నీకు వస్తుంది అని చెప్పాడు. స్వధర్మ్ బ్యానర్ కాబట్టి కథ కూడా వినకుండా ఓకే చెబుదామని అనుకున్నా. మసూద డైరెక్టర్‌ నన్ను ఓ సారి కలిశాడు. కలిసినంత మాత్రాన నిన్ను సినిమాలో తీసుకుంటానని అనుకోకు.. నిర్మాతకు నచ్చితేనే తీసుకుంటాను అని అన్నారు. ఆడిషన్ కోసం ఓ సీన్ చేశాం. అందులో ఇంగ్లీష్‌ డైలాగ్ చెప్పాల్సి ఉంటుంది. ఐదారు టేక్స్ తీసుకున్నా. ఇక సినిమా ఆఫర్ రాదని అనుకున్నా. కానీ చివరకు దర్శక నిర్మాతలకు నచ్చింది. మసూద ఆఫర్ వచ్చింది.

ఒకే రకమైన పాత్రలు చేయడం నాకు బాధగా అనిపించింది. నాకు ఎక్కువగా విలన్, సైకో పాత్రలే వచ్చాయి. అలాంటి కారెక్టర్లే నేను చేస్తానా? వాటికే సూట్ అవుతానా? అనే భావన నాలో కలిగేలా చేశారు. అందుకే అందులోంచి బయటకు రావాలి, వెరైటీ పాత్రలు చేయాలని అనుకున్నా. పైకి ఎవ్వరూ చెప్పకపోయినా కూడా అందరికీ హీరో అవ్వాలని ఉంటుంది. చిన్నప్పటి నుంచి గోడ మీద పోస్టర్లు చూసి కథలు అనుకుంటూ ఉండేవాడిని. పలాస టైంలోనూ నా పోస్టర్ ఉంటుంది. కానీ మసూద నాది అఫీషియల్‌గా ఫస్ట్ పోస్టర్.

ప్రతి ఒక్కరిలో భయాలు ఉంటాయి. నాకు చిన్నప్పటి నుంచీ చీకటి అంటే భయం. నేను నా జీవితంలోనూ గోపీలానే ఉంటాను. నాకు ఈ పాత్రను పోషించడం పెద్ద కష్టంగా అనిపించలేదు. మిగతా సినిమాల్లో చేసిన కారెక్టర్లే కష్టంగా అనిపించాయి. మసూదలో క్లైమాక్స్‌లో చేసిన స్టంట్స్ కాస్త కష్టంగా అనిపించాయి.

నాకు చిన్నప్పటి నుంచి నటీనటులను చూడటం ఇష్టం. షూటింగ్‌లు జరిగే సమయంలో వారిని చూసి తెగ సంబరపడిపోయేవాడిని. శుభలేక సుధాకర్, సంగీత, సత్యం రాజేష్ ఇలా అందరితో పని చేయడం సంతోషంగా ఉంది. వారితో పని చేస్తూ ఉంటే ఎన్నో విషయాలు నేర్చుకోగలం.

చిన్నతనంలో అమ్మ, నాన్నలను కథలు చెప్పమని అడిగేవాడిని. ఆ కథలు వింటూనే పడుకునేవాడిని. మసూద కథ విన్నప్పుడు కూడా నాకు చాలా నచ్చింది. మసూద కోసం తీసుకున్న నేపథ్యం అందరికీ కొత్తగా అనిపించింది.

నేను చేసిన చిత్రాలన్నీ అవార్డ్ విన్నింగ్, విమర్శకుల ప్రశంసలు వచ్చేలానే ఉంటాయి. మల్లేశం, పలాస, జార్జిరెడ్డి వల్ల నేను ఇండస్ట్రీ జనాలకు తెలిశాను. కానీ మసూదలో గోపి పాత్ర వల్ల కామన్ ఆడియెన్స్ వరకు చేరాను. నన్ను వారు గుర్తు పడుతున్నారు. సోషల్ మీడియాలో మెసెజ్‌లు పెడుతున్నారు.

మసూదతో నాలోని ఇంకో కోణం కూడా అందరికీ తెలిసిందే. నెగెటివ్ మాత్రమే కాదు ఇలాంటి పాత్రలు కూడా పోషించగలడని అంతా నమ్ముతున్నారు. దిల్ రాజు గారికి నా పాత్ర చాలా నచ్చింది.

ఒకప్పుడు నేను ఎక్కువగా మీమ్స్ వేసేవాడిని. కానీ ఇప్పుడు నా మీద మీమ్స్ వేస్తున్నారు. గోపీ పాత్రతో జనాలు ఎక్కువగా కనెక్ట్ అయ్యారు.

హీరో అనే ట్యాగ్ నాకు ఇష్టం ఉండదు. ప్రకాష్‌ రాజ్ గారు, కోట శ్రీనివాసరావు గారిలా అన్ని రకాల పాత్రలు చేయాలనే కోరిక ఉంది. నేను సినిమాలో ఉంటే బాగుంటుందని జనాలు అనుకుంటే చాలు.

నా పేరు తిరుపతి రెడ్డి. నేను గురువుగా భావించే రఘువీర్ నుంచి వీర్ అని తీసుకుని తిరువీర్ అని పెట్టుకున్నా. అయితే వీర్ అనేది మరో సెంటిమెంట్‌ కూడా యాడ్ అయింది. వీరమ్మ అనేది మా అమ్మ పేరు. అమ్మ, గురువు నుంచి తీసుకోవడంతో తిరువీర్ అనేది నాకు రెండు రకాలుగా సెంటిమెంట్ అయింది.

ప్రస్తుతం పరేషాన్ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. మోక్షపటం అనే చిత్రం కూడా లైన్‌లో ఉంది. వైజయంతీ మూవీస్‌లో ఓ వెబ్ సిరీస్ ఉంది. పారాహుషార్ అనే మరో సినిమా కూడా లైన్‌లో ఉంది. అలా మూడు సినిమాలు, ఒక వెబ్ సిరీస్ ఉన్నాయి. కొత్తగా ఏ ప్రాజెక్ట్‌ను అంగీకరించలేదు. కథ నచ్చితేనే సినిమాలు చేద్దామని, కౌంట్ కోసం చేయకూడదని అనుకుంటాను.

కమల్ హాసన్ ద్రోహి, విచిత్ర సోదరులు, స్వాతి ముత్యం ఇలా వెరైటీ కథలు, కారెక్టర్లు చేయాలని ఉంది. అయితే రెమ్యూనరేషన్ కోసం మాత్రం సినిమాలు చేయను. కథ, స్క్రిప్ట్ నచ్చితేనే సినిమాలు చేస్తాను.

‘ధర్మచక్రం’ ఫస్ట్ లుక్ విడుదల..

‘ధర్మచక్రం’ ఫస్ట్ లుక్ విడుదల..

సంకేత్ తిరుమనీడి, మౌనిక చౌహాన్ జంటగా పద్మ నారాయణ ప్రొడక్షన్ బ్యానర్ లో నాగ్ ముంతా దర్సకత్వం లో తెరకెక్కిస్తున్న సినిమా ధర్మచక్రం. సందేశాత్మక కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. తాజాగా “ధర్మచక్రం” ఫస్ట్ లుక్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. దీనికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఆనంద్ మరుకుర్తి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు.. ప్రణయ్ రాజపూటి సంగీతం అందిస్తున్నారు.

దర్శకుడు నాగ్ ముంతా మాట్లాడుతూ.. ‘ ధర్మచక్రం మెసేజ్ ఓరియెంటెడ్ గా తెరకెక్కిస్తున్నాము. సమాజంలో ఆడవాళ్ళపై జరుగుతున్న అఘాయిత్యాలు, ఆకృత్యాల నేపథ్యంలోనే ఈ చిత్ర కథ ఉంటుంది. అమ్మాయిల స్వీయ రక్షణ ఎలా ఉండాలో ఈ సినిమాలో చూపిస్తున్నాము. హీరోయిన్ మోనిక చౌహన్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే ఈ చిత్రం విడుదల తేదీ అనౌన్స్ చేస్తాము..’ అని తెలిపారు.

నటీనటులు:

సంకేత్ తిరుమనీడి, మౌనిక చౌహాన్, చైతన్య, ప్రవీణ్ కుమార్, ధృవ, జానీ ఫీవర్ మైలవరం, నరసింహా రావు తదితరులు..

టెక్నికల్ టీమ్:

దర్శకుడు: నాగ్ ముంతా
నిర్మాత: జిపి రెడ్డి
సినిమాటోగ్రఫర్: ఆనంద్ మరుకుర్తి
సంగీతం: ప్రణయ్ రాజపూటి
యాక్షన్: హంగామా కృష్ణ బమ్మిడి
పి ఆర్.ఓ : లక్ష్మీ నివాస్