9010892345 Whatsup moviepromotion.pro@gmail.com
Select Page
ఎంగేజింగ్ పొలిటికల్ హారర్ థ్రిల్లర్

ఎంగేజింగ్ పొలిటికల్ హారర్ థ్రిల్లర్

తారకరత్న, ప్రిన్స్, సునీల్, అలీ, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో భరత్ కోమలపాటి(సన్నీ కోమలపాటి) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం S5 No Exit. శౌరీ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై
ఆదూరి ప్రతాప్ రెడ్డి, దేవు శామ్యూల్, షైక్ రెహీమ్, మెల్కి రెడ్డి గాదె,
గౌతమ్ కొండెపూడి నిర్మించారు. హర్రర్ థ్రిల్లర్ కి… కాస్త పొలిటికల్ డ్రామాను జోడించి తెరకెక్కిన ఈ చిత్రం ఈ రోజే విడుదలయింది. మరి ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమాత్రం అలరించిందో చూద్దాం పదండి.

సినిమా కథ: ప్రజాసేవ పార్టీ ముఖ్యమంత్రి(సాయి కుమార్) తనయడు సుబ్బు(తారకరత్న) తన పుట్టిన రోజు వేడుకలను హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్లే ట్రైన్ లోని ఎస్5 బోగీలో జరుపుకోవాలని తండ్రి ప్లాన్ చేస్తారు. దాంతో సుబ్బు తన మిత్రులతో కలిసి తన పుట్టినరోజు వేడుకలను ఎస్5 బోగీలో జరుపుకుంటూ… వైజాగ్ వెళుతుంటే మధ్యలో సన్నీ(ప్రిన్స్) తన డ్యాన్స్ బృందంతో కలిసి అదే బోగీలో అనుకోకుండా ఎక్కుతాడు. అక్కడ సుబ్బు, సన్నీ బ్యాచ్ కి ఒకరంటే ఒకరు గిట్టకుండా… అస్తమాను తగువులాడుతూ ప్రయాణం చేస్తూ ఉంటారు. అయితే ఉన్నట్టుండి ఆ కోచ్ లో ఒక్కొక్కరూ మాయం అవుతూ… ఆ కోచ్ తలుపులు తెరుచుకోకుండా సుబ్బు అండ్ సన్నీ బ్యాచ్ ని ఏదో ఒక తెలియని భూతం హింసిస్తూ ఉంటుంది. ఒక్కొక్కరుగా మాయమవుతూ ఉంటే… చివరకు సుబ్బు అతని స్నేహితుడు సంజయ్ తో కలిసి ట్రై నుంచి దూకేసి ప్రాణాలు కాపాడుకుంటారు. మరి ఇలా ప్రాణాలు కాపాడుకున్న వీళ్లని ఎస్5 కోచ్ లో ఎవరు ఇబ్బంది పెట్టారు? ఎందుకు వాళ్లని హింసించారు? చనిపోయిన వాళ్లంతా ఏమయ్యారు? ఆ కోచ్ లో వున్న దెయ్యం ఎవరు? చివరకు ఎలాంటి నిజాలు బయటకు వచ్చాయి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కథ… కథనం విశ్లేషణ: తారకరత్న ఇటీవల కాస్త వైవిధ్యం ఉన్న పాత్రలను ఎంచుకుని సినిమాలు చేస్తున్నారు. గతంలో కూడా అమరావతి లాంటి సినిమాలో విలనిజం వున్న పాత్రను చేసి మెప్పించారు. ఇటీవల వెబ్ సిరీస్ లో కూడా ఓ డిఫరెంట్ రోల్ పోషించి మెప్పించాడు. ఇందులో కూడా తారకరత్న చాలా డిఫరెంట్ గా ఉంటుంది. తన లుక్ కూడా ఇంతకు ముందుకంటే చాలా స్టైలిష్ గా వుంది. దర్శకుడు తన తొలి సినిమాకి ఓ వైవిధ్యమైన కథను ఎంచుకుని స్క్రీన్ పై ఆవిష్కరించారు. హారర్ థ్రిల్లర్ కి… కాస్త పొలిటికల్ డ్రామను కూడా జోడించడం ఆసక్తి కలిగిస్తుంది. హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లే ట్రైన్ లో ఒక కోచ్ మొత్తం మంటలు అంటుకోవడం… అందులో ఉన్న వాళ్లంతా చనిపోయారనుకుంటే… తిరిగి బతికి రావడం… ఆ ఒక్క బోగికే ఎందుకు మంటలు వ్యాపిస్తాయి? సీఎం తనయుడు సుబ్బు తన మిత్రులతో కలిసి బోగిని అలంకరించుకుని పార్టీ చేసుకుంటూ వుంటే… సడెన్ గా కోచ్ డోర్స్ క్లోజ్ కావడం… ఆ తర్వాత అగ్నిప్రమాదం జరగడం… అసలా అగ్నిప్రమాదం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఆ తర్వాత ఏమైందనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. చివరిదాకా ఊహకందని ట్విస్టులతో సినిమా ఆద్యంతం ఉత్కంఠను రేపుతుంది.

తండ్రి చెప్పిన మాట ప్రకారం నడుచుకునే సుబ్బు పాత్రలో తారకరత్న బాగా నటించారు. మాటలు కూడా చాలా తక్కువగా వుంటాయి. కేవలం హావ భావాలతోనే ఆకట్టుకున్నారు. నాన్న చెప్పిందే చేస్తా నాకేం తెలియదు అన్నట్టు ఉండే సుబ్బు… చివరకు ఎలాంటి డెసిషన్ తీసుకుకుంటారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. టీసీ పాత్రలో అలీ చేసే కామెడీ అందరినీ ఆకట్టుకుంటుంది. బిగ్ బాస్ కాన్సెప్ట్ డైలాగులు బాగా కనెక్ట్ అవుతాయి. దుబాయ్ నుంచి వచ్చే సులేమాన్ పాత్రలో సునీల్ కాసేపు కనిపించి బాగా నవ్విస్తాడు. ఇస్మార్ట్ శంకర్ లోని పాటలకు డ్యాన్స్ చేస్తూ… తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. దొంగల బ్యాచ్ కి లీడర్ వహించే పాత్రలో ప్రిన్స్ బాగా సూట్ అయ్యారు. గబ్బర్ సింగ్ బ్యాచ్, ఫిష్ వెంకట్, రఘు తదితరులు అంతా తమ కామెడీ ట్రాక్ లతో అలరించారు.

ఇండస్ట్రీలో హీరో అవుదామని వచ్చి… చివరకు కొరియోగ్రాఫర్ గా మారి.. ఇప్పుడు దర్శకుడి అవతారం ఎత్తిన దర్శకుడు భరత్ కోమలపాటి… ఈ చిత్రానికి కాస్త వైవిద్యంగా వున్న కథను రాసుకుని… దాన్ని సెల్యులాయిడ్ పై ఓ వైపు భయపెడుతూనే… మరో వైపు వినోదాత్మకంగా ఆవిష్కరించారు. హారర్ థ్రిల్లర్ కి పొలిటికల్ డ్రామాను జోడించి… చాలా ఆసక్తికరంగా సినిమాని తెరకెక్కించారు. మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్… ఇలాంటి హారర్ సినిమాలకు పర్ ఫెక్ట్ యాప్ట్ అయింది. గరుడవేగ అంజి అందించిన సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటింగ్ కూడా చాలా గ్రిప్పింగ్ గా వుంది. నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా… కంటెంట్ ను నమ్ముకుని సినిమా తీశారు. చాలా రిచ్ గా వున్నాయి నిర్మాణ విలువలు. గో అండ్ వాచ్ ఇట్.

మూవీ ప్రమోషన్ రేటింగ్ : 3/5

నువ్వే నా ప్రాణం..మూవీ రివ్యూ

నువ్వే నా ప్రాణం..మూవీ రివ్యూ

కిరణ్‌రాజ్‌, ప్రియాహెగ్డే జంటగా నటించిన చిత్రం నువ్వే నా ప్రాణం. వరుణ్‌ కృష్ణ ఫిల్మ్స్‌ పతాకంపై శేషుదేవ రావ్‌ మలిశెట్టి నిర్మించిన ఈ చిత్రానికి శ్రీకృష్ణ మలిశెట్టి దర్శకత్వం వహించారు. సుమన్, భానుచందర్‌, గిరి, సోనీ చౌదరి ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ చిత్రం టీజర్, ట్రైలర్లతో ఆకట్టుకుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఏమాత్రం ఆకట్టుకుందో లేదో చూద్దాం.

సినిమా కథ: సంజు(కిరణ్ రాజ్) సరదాగా తిరుగుతూ… గైనకాలజిస్టుగా పనిచేసే కిరణ్(ప్రియా హెగ్డే)ని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. అయితే కిరణ్ మాత్రం అతని ప్రేమను అంగీకరించదు. కానీ… సంజు మాత్రం కిరణ్ వెంటపడుతూ… ఆమె ప్రేమను పొందడానికి చాలా రకాలుగా ట్రై చేస్తుంటాడు. అయితే ఓ సందర్భంలో సంజు సాధారణ యువకుడు కాదు… అతను కూడా ఓ బాధ్యతాయుతమైన పొజిషన్లో వున్న వ్యక్తి… పైగా ఎమ్మెల్యే ఆది శేషు(సుమన్) అని తెలుసుకుని… సంజుని ప్రేమించడం ప్రారంభిస్తుంది. అయితే.. కిరణ్ తండ్రి (భాను చందర్) కూడా సంజు తండ్రి ఆది శేషుకు మంచి మిత్రుడు కావడంతో… ఇద్దరికీ పెద్దల సమక్షంలో వివాహం జరుగుతుంది. అయితే పెళ్లయిన తరువాత కిరణ్ పద్ధతిగా చీరలు కట్టుకోవడం సంజుకి అసలు ఇష్టం వుండదు. ఆమెను పొట్టి డ్రస్సుల్లో చూడాలని… పబ్ కు పోయి డిస్కో థెక్ లు వేయాలని బలవంతం చేస్తూ… మందు, సిగరెట్లు తాగుతూ ఉంటాడు. ఉన్నట్టుండి సంజు అలా ఎందుకు మారాడు? వీటన్నింటినీ కిరణ్ ఎలా భరించి సాల్వ్ చేసుకుంది? ఇవి తెలుసుకోవాలి అనుకుంటే సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :
దర్శకుడు
హీరో
హీరోయిన్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
ఎడిటింగ్
సెకండ్ హాఫ్
మైనస్ పాయింట్స్ :

మొదటి భాగం అక్కడ అక్కడ బోరింగ్ సీన్స్

సినిమా కథ… కథనం విశ్లేషణ: కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడిన ప్రేమకథలు చాలానే చూసుంటాం. కానీ… అందులో ఓ బాధ్యతాయుతమైన యువతీ యువకుల మధ్య కలిగే ప్రేమ కథని అందంగా తెరపై సెటిల్డ్ గా ఆవిష్కరించడం అంటే సాహసమే. కానీ.. నువ్వే నా ప్రాణం చిత్రంలో ఇది సాధ్యమైంది. ఓ బాధ్యత గల పోలీస్ అధికారి… పేదరికంతో ఇబ్బందులు పడే గర్భిణీల ఆరోగ్యం పట్ల ఎంతో బాధ్యతగా శ్రద్ధ తీసుకునే ఓ వైద్యురాలు… ఈ ఇద్దరి మధ్య ప్రేమకథని నడిపించి… ప్రేక్షకులను మెప్పించారు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ లో హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమ, పెళ్లితో నడిపించి… సెకెండాఫ్ లో సంప్రదాయంగా మెలిగే భార్యను పాశ్చాత్య పోకడలను అలవాటు చేసుకోవాలని హింసించే భర్త… దాన్నుంచి బయట పడటానికి హీరోయిన్ పడే కష్టాలు, సంజుని మార్చడానికి గిరి, సోనీ చౌదరి పాత్రలు ఎంటర్ చేసి… భార్యభర్తల మధ్య అన్యోన్యత ఎలా ఉండాలి అనే దానికి వీరి జంటను ఉదాహరణ చూపించడం… లాంటి సీన్లు ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటాయి. అలాగే యూత్ కి కావాల్సిన గ్లామర్ కోషంట్ కూడా ఇందులో ఉంది. హీరోయిన్ ప్రియా హెగ్డే అందాలు బాగా ఆకర్షిస్తాయ. చివర్లో వచ్చే ఐటెం సాంగ్ మాస్ ని బాగా ఆకట్టుకుంటుంది. అలాగే పెడదోవ పట్టే యువతకి తల్లిదండ్రులు చేయాల్సిన మార్గనిర్దేశాలను ఇందులో చూపించారు. ఫైనల్ గా నువ్వే నా ప్రాణం… యువతతో పాటు… ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది.
హీరోగా నటించిన కిరణ్ రాజ్… ఇందులో ప్రేమికునిగా… బాధ్యతగల పోలీస్ ఆఫీసర్ గా, మరో వైపు మద్యం, సిగరెట్లకు బానిసై… భార్యను మోడ్రన్ దుస్తుల్లో చూడాలనుకునే శాడిజం వున్న భర్తగా… ఇలా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో కనిపించి మెప్పించారు. పాటలు, ఫైట్లలోనూ తన ఈజ్ ను చూపించారు. హీరోయిన్ గా నటించిన ప్రియా హెగ్డే తన అందలతో పాటు… నటనతోనూ ఆకట్టుకుంటుంది. పాటల్లో తన అంద చందాలతో యూత్ ని బాగా ఆకట్టుకుంటుంది. మరో వైపు సంప్రదాయ దస్తుల్లో పక్కింటి అమ్మాయిగా కనిపించింది. ఎమ్మెల్యే ఆది శేషు పాత్రలో సుమన్, హీరోయిన్ తండ్రి పాత్రలో భాను చందర్ నటించి మెప్పించారు. అలాగే పైకి ఎంతో అన్యోన్యతగా కనిపిస్తూ… లోపల బాగా పోట్లాడుకునే జంటగా కమెడియన్ గిరి, యాంకర్ సోనీ చౌదరిల పెయిర్ బాగా నవ్విస్తుంది.

దర్శకుడు శ్రీకృష్ణ మలిశెట్టి సివిల్ ఇంజినీర్ అయినా… దర్శకత్వ శాఖలో ఎంతో అనుభవం వున్న వ్యక్తిగా చిత్రాన్ని ఎంతో అందంగా వెండితెరపై ఆవిష్కరించారు. యూత్ ని, ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ… ఎక్కడా ఒల్గారిటీ లేకుండా సినిమాని తెరకెక్కించి సక్సెస్ అయ్యారు. హీరోని మొదట ఓ సాధారణ యువకుని గా చూపించి… ఆ తరువాత అతను సామాన్యుడేమీ కాదు… అతనూ సొసైటీలో పలుకుబడి వున్న కుటుంబం నుంచి వచ్చిన వాడు… పైగా ఎంతో బాధ్యతా యుతమైన వృత్తిలో మెలిగే యువకుడు అని చూపించడం యువతకు ఇన్సిపిరేషన్. సంగీతం బాగుంది. మాస్ ను మెప్పించే పాటలున్నాయి. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటింగ్ సెకెండాఫ్ లో ఇంకాస్త క్రిస్పీగా వుండాల్సింది. నిర్మాత శేషుదేవ రావ్‌ మలిశెట్టి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను తెరకెక్కించారు. గో అండ్ వాచ్ ఇట్.

మూవీ ప్రమోషన్ రేటింగ్: 3/5

టాప్ గేర్ మూవీ రివ్యూ

టాప్ గేర్ మూవీ రివ్యూ

నటీనటులు: ఆది సాయికుమార్, రియా సుమన్, బ్రహ్మజీ, సత్యం రాజేశ్, మైమ్ గోపీ, శత్రు, బెనర్జీ, వం శీ, ఆర్జే
హేమం త్, చమ్మ క్‌ చం ద్ర
నిర్మా ణ సం స్థలు:ఆదిత్య మూవీస్ ఎం టర్‌టైన్‌మెం ట్స్ , శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యా నర్‌
నిర్మా త: కేవీ శ్రీధర్‌ రెడ్డి
దర్శకత్వం : కె.శశికాం త్
సం గీతం : హర్షవర్ధన్ రామేశ్వర్,
సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్
ఎడిటర్: ప్రవీణ్ పూడి
విడుదల తేదీ: డిసెంబర్ 30,2022

అసలు కథేం టం టే:
ఆది సాయికుమార్(అర్జున్) ఓ క్యా బ్‌ డ్రైవర్. రియా సుమన్(ఆద్య )ను పెళ్లి చేసుకుని సం తోషం గా జీవనం
సాగిస్తుం టాడు. కొత్తగా పెళ్లైన దం పతులు కావడం తో చాలా అన్యో న్యం గా ఉం టారు. మైమ్‌ గోపీ(సిద్ధార్థ్‌) డ్రగ్స్
సరఫరా చేస్తుం టాడు. పోలీసుల నుం చి తప్పిం చుకుని తిరుగుతుం టాడు. ఇతని ముఠాలో బ్రహ్మజీ, సత్యం రాజేశ్‌
కూడా ఉం టారు.
డ్యూ టీకి వెళ్లిన అర్జున్‌ ఇం టికొస్తుం డగా ఓ క్యా బ్‌ బుకిం గ్‌ ఆర్డర్‌ వస్తుం ది. అక్క డే అసలు కథ మొదలవుతుం ది.
అనుకోకుం డా ఆరోజు అతని క్యా బ్‌లో ఇద్దరు వ్య క్తులు ఎక్కు తారు. ఆరోజు రాత్రి అర్జున్‌కు ఊహిం చని పరిణామాలు
ఎదురవుతాయి. అతనికి ఓ గుడ్‌ న్యూ స్‌ చెప్పా లని భార్య ఆద్య ఇం టి దగ్గర నిరీక్షిస్తూ ఉం టుం ది. కానీ ఆరోజు రాత్రి
అర్జున్‌ ఇం టికెళ్లాడా? ఆ గుడ్‌ న్యూ స్‌ విన్నా డా? అసలు క్యా బ్‌లో ఎక్కి న ఆ ఇద్దరు వ్య క్తులు ఎవరు? ఆ తర్వా త
అర్జున్‌కు ఎలాం టి పరిణామాలు ఎదురయ్యా యి? డ్రగ్స్‌ ముఠాకు, హీరోకు సం బం ధం ఏం టీ? అర్జున్‌ను పోలీసులు
ఎం దుకు పట్టుకోవాలనుకుం టున్నా రు? అనేది తెరపై చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

డైరెక్షన్
గోపి
హీరో
హీరోయిన్
ఇంటర్వెల్

మైనస్ పాయింట్స్
ఫస్ట్ 10 నిముషాలు

కథ లో కి వెళితే :
డ్రగ్స్‌ ముఠా నేపథ్యం లో ఈ సినిమా కథ సాగుతుం ది. విలన్‌ ఇం ట్రడక్షన్‌తోనే కథ మొదలవుతుం ది. ఆ తర్వా త ఆది,
రియా సుమన్‌ పెళ్లి, దం పతుల మధ్య రొమాం టిక్‌ సన్ని వేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుం టాయి. ఫస్టాఫ్‌లో ఎలాం టి
పరిచయం లేకుం డానే డైరెక్ట్‌గా పాత్రలను రం గం లోకి దిం చారు డైరెక్టర్. జీవనం సాఫీగా నడుస్తున్న క్యా బ్‌ డ్రైవర్‌
జీవితం లోకి డ్రగ్స్‌ ముఠా ఎం ట్రీ కావడం , ఎలాం టి ట్వి స్ట్‌లు లేకుం డానే కథ సాగడం ప్రేక్షకుల కాస్త బోర్ కొట్టిం చిం ది.
డ్రగ్స్‌ ముఠాను పట్టుకునేం దుకు పోలీసుల ఆపరేషన్‌ చుట్టే కథ మొత్తం తిరుగుతుం ది. ఫస్టాఫ్‌ ఓ రొమాం టిక్‌ సాం గ్
మినహా ఎలాం టి యాక్షన్ సీన్స్‌ , కామెడీ లేకుం డానే ముగుస్తుం ది.
సెకం డాఫ్‌కు వచ్చే సరికి కథలో వేగం పెం చారు. డ్రగ్స్ ముఠా, హీరో మధ్య సన్ని వేశాలతో ఆద్యం తం ఆసక్తికరం గా
సాగిం ది. కథలో డేవిడ్‌ అనే పాత్రే అసలు ట్వి స్ట్. సెకం డాఫ్‌ మొత్తం డ్రగ్స్ ఉన్న బ్యా గ్‌ చుట్టే కథ నడిపిం చారు. మధ్య లో
అక్క డక్క డ కొత్త పాత్రల ఎం ట్రీతో ప్రేక్షకుల్లోఆసక్తి మరిం త పెం చారు. డ్రగ్స్ ముఠా, పోలీసులు, హీరో చుట్టే
సెకం డాఫ్‌ తిరుగుతుం ది.మధ్య లో ఓ యాక్షన్‌ ఫైట్‌, డ్రగ్స్ బ్యా గ్‌ కోసం హీరో అర్జున్‌(ఆది) చేసే సాహసం హైలెట్. ఒకవైపు యాక్షన్‌
సన్ని వేశాలు చూపిస్తూనే.. మరోవైపు భార్య, భర్తల ప్రేమానురాగాలను డైరెక్టర్‌ చక్క గా చూపిం చారు. క్లైమాక్స్‌ లో వచ్చే
ట్వి స్ట్‌ నవ్వులు తెప్పిం చడం ఖాయం . సీరియస్‌ సీన్లలో కామెడీ పం డిం చడం శశికాం త్‌కే సాధ్య మైం ది. ఓవరాల్‌గా
మనుషుల ఎమోషన్స్‌ తో ఇతరులు ఎలా ఆడుకుం టారనే సం దేశాన్ని చ్చా రు డైరెక్టర్‌. అలాగే డ్రగ్స్‌ బారినపడి యువత
జీవితాలను ఎలా నాశనం చేసుకుం టున్నా రనే సం దేశమిచ్చా రు డైరెక్టర్.న్‌గా మైమ్‌ గోపీ(సిద్ధార్థ్‌) ఆకట్టుకున్నా రు. శత్రు(ఏసీపీ విక్రం ) పాత్రలో ఒదిగిపోయాడు. బ్రహ్మా జీ, సత్యం రాజేశ్, బెనర్జీ, వం శీ, ఆర్జే హేమం త్, చమ్మ క్‌ చం ద్ర తమ పాత్రలకు న్యా యం చేశారు. హర్షవర్ధన్ రామేశ్వ ర్ బీజీఎం
సినిమాకు ప్లస్. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ పూడి ఎడిటిం గ్ పర్వా లేదు.ఆదిత్య మూవీస్ఎం టర్‌టైన్‌మెం ట్స్ , శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యా నర్‌ నిర్మా ణ విలువలు స్థాయికి తగ్గట్టుగా బాగున్నా యి.

 

యువ సాఫ్ట్ వేర్ చూపు… సినిమా రంగం వైపు

యువ సాఫ్ట్ వేర్ చూపు… సినిమా రంగం వైపు

 

సినిమా ప్రపంచంలో విహరించాలని కలలు కనేవాళ్లు చాలా మంది ఉంటారు. కానీ ఆ కలలను నిజం చేసుకోవాడానికి అహర్నిషలు శ్రమించే వాళ్లు కొందరే ఉంటారు. గ్లామర్ ప్రపంచలో రాణించాలనుకునే వాళ్లు దానికి తగ్గట్టుగా తమ ఆహార్యం మొదలుకొని… వర్చస్సును మార్చుకోవడానికి ఎంతో శ్రమించాలి. అలా సినిమా గ్లామర్ ను తన సొంతం చేసుకుని అవకాశాలకోసం ఎదురు చూస్తున్నారు అంబటి చైనత్య రెడ్డి. సుప్రసిద్ధ సాఫ్ట్ వేర్ కంపెనీ హెచ్ సీఎల్ కంపెనీలో లీడ్ ఇంజినీర్ గా చేస్తూనే… ఐదెంకెల జీతాన్ని సంపాధిస్తున్నా… తన మనసు అంతా సినిమా… ఫ్యాషన్ ప్రపంచంలోనే విహరిస్తుంటుంది. అందుకే అహర్నిషలు జిమ్ లో వర్కవుట్లు చేస్తూ… దేహాన్ని సిక్స్ ప్యాక్ గా మార్చుకున్నారు చైతన్య. ఓ వైపు సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో బిజీగా ఉంటూనే… మరోవైపు కొన్ని గంటల పాటు జిమ్ లో గడిపి… సిక్స్ ప్యాక్ ని సొంతం చేసుకున్నాడు. ఓ వైపు డ్యూటీ చేస్తూనే… మరోవైపు మోడలింగ్, సినిమా ఛాన్సుల కోసం ప్రయత్నిస్తున్నారు చైతన్య. ఇటీవలే ఓ సంస్థలో సినిమా చేయడానికి సంతకం కూడా చేశారు. ఇలా ఇంకా మరిన్ని సినిమా ఛాన్సులు దక్కించుకొని… సినిమా రంగంలో రాణించాలని కోరుకుంటూ… ఆల్ ది బెస్ట్ చైతన్య.

లక్కీ లక్ష్మణ్ మూవీ రివ్యూ

లక్కీ లక్ష్మణ్ మూవీ రివ్యూ

తెలుగులో బాగా పాపులర్ అయిన రియాలిటీ షో… బిగ్ బాస్ ద్వారా ప్రేక్ష‌కుల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న సోహైల్… సామాజిక సేవా కార్య‌క్ర‌మాల ద్వారా కూడా ప్ర‌జ‌ల‌కు మ‌రింత‌గా ద‌గ్గ‌రయ్యారు. ఈయ‌న హీరోగా నాలుగు సినిమాలు చేస్తున్నారు. అందులో ముందుగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సినిమా ‘లక్కీ లక్ష్మణ్’. బిగ్ బాస్ కంటే ముందు సీరియల్స్‌లో న‌టించి మెప్పించిన సోహైల్‌కు యాక్టింగ్ కొత్తేమీ కాదు. అయితే సిల్వ‌ర్ స్క్రీన్ ఎక్స్‌పీరియెన్స్ మాత్రం కొత్త‌దే. మ‌రి ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్‌గా సోహైల్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నారా? నిజంగానే సోహైల్ ల‌క్కీయేనా? అస‌లు ఈ సినిమా ద్వారా త‌నేం చెప్పాల‌నుకున్నారు? అనే విష‌యాల‌ను తెలుసుకోవాలంటే ముందు సినిమా చూడాల్సిందే…!!!

కథ: ల‌క్ష్మ‌ణ్ అలియాస్ ల‌క్కీ (సోహైల్‌) తండ్రి వెంక‌టేశ్వ‌ర‌రావు(దేవీ ప్ర‌సాద్ దిగువ మ‌ధ్య త‌ర‌గ‌తికి చెందిన వ్య‌క్తి. చిన్న‌ప్ప‌టి నుంచి ల‌క్కీ త‌ల్లిదండ్రుల‌ను ఏమ‌డిగినా త‌మ వ‌ద్ద డ‌బ్బులేదంటుంటారు. దాంతో పేరెంట్స్‌పై ల‌క్కీకి తెలియ‌ని ఓ కోపం పెరిగిపోతుంది. ఇంజ‌నీరింగ్‌లో చేరిన త‌ర్వాత ల‌క్కీకి శ్రియ (మోక్ష‌)తో ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. ఆ ప‌రిచ‌యం ప్రేమ‌గా మారుతుంది. ల‌క్కీ పేద‌రికాన్ని అర్థం చేసుకున్న శ్రియ అత‌నికి స‌పోర్ట్ చేస్తుంది. ల్యాప్ టాప్‌, బైక్ వంటి వాటిని కొనిస్తుంది. అదే స‌మ‌యంలో మ‌రో అమ్మాయి ల‌క్కీకి ద‌గ్గ‌ర‌వ్వాల‌ని చూస్తుంది. దీని కార‌ణంగా ల‌క్కీ, శ్రియ విడిపోతారు. అదే స‌మ‌యంలో ల‌క్కీ త‌ల్లిదండ్రులపై ఉన్న కోపంతో వారి నుంచి దూరంగా వ‌చ్చేస్తాడు. ల‌క్కీ మ్యారేజ్ బ్యూరోని స్టార్ట్ చేసిన ల‌క్కీ డ‌బ్బే స‌ర్వ‌స్వం అనుకుంటుంటాడు. అలాంటి ల‌క్కీకి ఎదురైన అనుభ‌వాలేంటి? ధ‌న‌వంతురాలైన శ్రియ ఎందుకు డ‌బ్బు లేని అమ్మాయిగా మారుతుంది.. చివ‌ర‌కు ల‌క్కీకి త‌న తండ్రి గురించి తెలిసిన నిజం ఏంటి? ల‌క్కీ త‌న ప్రేమ‌ను గెలుచుకుంటాడా.. డ‌బ్బు వెనుకే ప‌రిగెడుతాడా? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

కథ.. కథనం విశ్లేషణ: ఇద్ద‌రు వ్య‌క్తులు సంతోషంగా ఉండాలంటే వారి మ‌ధ్య డ‌బ్బు కంటే ప్ర‌ధాన‌మైన‌ది భావ సారూప్య‌త ముఖ్యం. ఆ విష‌యాన్ని చెప్ప‌టానికే ద‌ర్శ‌కుడు అభి చేసిన ప్ర‌య‌త్న‌మే ‘ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్’ చిత్రం. ఫ్యామిలీతో క‌లిసి చూసే ప్రేమ క‌థా చిత్రంగా అభి క‌థ‌ను త‌యారు చేసుకున్నారు. అయితే కేవ‌లం ప్రేమ క‌థ‌గా సినిమాను తెర‌కెక్కించాల‌నుకోలేదు. అలాగే ల‌వ్ స్టోరి క‌దా.. రెండు, మూడు లిప్ లాక్స్ వంటి స‌న్నివేశాల‌ను పెట్టాల‌ని కూడా అనుకోలేదు. క్లీన్‌గా తెర‌కెక్కించాల‌నుకోవ‌ట‌మే ఈ సినిమాకు ప్ల‌స్. దీనికి తోడు తండ్రి ఎమోష‌న్‌ను అండ‌ర్ కరెంట్‌గా ర‌న్ చేస్తూ వ‌చ్చారు. సినిమా మెయిన్ ట‌ర్నింగ్ పాయింట్‌కి అదే బేస్ అయ్యింది. ఆడియెన్స్ కూడా ఆ పాయింట్‌కే ఎక్కువ‌గా క‌నెక్ట్ అయ్యారు.

సోహైల్ స్క్రీన్ ప్రెజెన్స్ బావుంది. త‌న‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. మాస్ ఇమేజ్ కావాలి.. విల‌న్లను కొడితే ఎగిరెగిరి ప‌డాలి అనే స్టైల్లో కాకుండా కూల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌లో క‌థానుగుణంగా ఉండే త‌న పాత్ర‌లో సోహైల్ ఒదిగిపోయారు. మోక్ష కూడా త‌న పాత్ర ప‌రిధి మేర‌కు చ‌క్క‌గా న‌టించింది. దేవీ ప్ర‌సాద్‌, కాదంబ‌రి కిర‌ణ్ కుమార్ త‌దిత‌రులు అంద‌రూ చ‌క్క‌గా న‌టించారు. దిగువ మధ్య తరగతి తండ్రి పాత్రలో ఆయన నటన బావుంది. ఇక కాందబరి కిరణ్ కుమార్ కాసేపే కనిపించినప్పటికీ ఎమోషనల్ సీన్స్ లో సూపర్‌గా చేశారు. సోహైల్, కాదంబరి సన్నివేశానికైతే ఆడియెన్స్ క్లాప్స్ కొడతారంటే .. సీన్ ఎంత బాగా పండిందో అర్థం చేసుకోవచ్చు.
ద‌ర్శకుడు అభి అండ‌ర్ క‌రెంట్‌గా చెప్పాల‌నుకున్న విష‌యం ఎమోష‌న‌ల్‌గా ఉంది. దాన్ని ప్రెజంట్ చేసిన తీరు బావుంది. హీరో, హీరోయిన్ కాలేజ్ స్టోరి, దాని చుట్టూ న‌డిచే ల‌వ్ ట్రాక్ అన్నీ బాగున్నాయి. ఫస్టాఫ్ మొదలుకొని… సెకండాఫ్ ప్రధాన బలంగా నిలిచాయి. సినిమాలో కాస్త కామెడీ ట్రాక్‌ కూడా బాగుంది. సెకండాఫ్‌లో ప్రీ క్లైమాక్స్ నుంచి క‌థ వేగంగా కదులుతూ… దానికంటే డిఫ‌రెంట్‌గా, ఎమోష‌న‌ల్‌గా వెళుతుంది. అనూప్ అందించిన నేప‌థ్య సంగీతం బావుంది. ఓ మేరీ జాన్ సాంగ్ బావుంది. అండ్రూ సినిమాటోగ్ర‌ఫీ బావుంది. త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల‌పై చూపించే ప్రేమ‌, కోపం వెనుక బ‌ల‌మైన ప‌రిస్థితులుంటాయ‌నే విష‌యాన్ని చ‌క్క‌గా చూపించారు. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. ఖర్చుకు వెనుకాడకుండా సినిమాని చాలా క్వాలిటీ గా నిర్మించారు. టోటల్ గా ఫ్యామిలీ ఆడియన్స్ ని లక్కీ లక్ష్మణ్ అలరిస్తాడు. గో అండ్ వాచ్ ఇట్..!

రేటింగ్: 3/5