9010892345 Whatsup moviepromotion.pro@gmail.com
Select Page
ఎంగేజింగ్ సస్పెన్స్ క్రైం థ్రిల్లర్… సిఎస్ఐ సనాతన్

ఎంగేజింగ్ సస్పెన్స్ క్రైం థ్రిల్లర్… సిఎస్ఐ సనాతన్

ఆది సాయికుమార్, మిషా నారంగ్ జంటగా నటించిన చిత్రం ‘సిఎస్ఐ సనాతన్’. సస్పెన్షన్ క్రైం థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో నందిని రాయ్, తారక్ పొన్నప్ప, మధు సూదన్ రావు, ఆలీ రాజా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకుల్ని ఏమాత్రం థ్రిల్ కు గురి చేసిందో చూద్దాం పదండి.

కథ: విసి ఫైనాన్స్ కంపెనీ సీయీవో విక్రమ్ చక్రవర్తి(తారక్ పొన్నప్ప) ఓ రోజు రాత్రి తన ఆఫీసులోనే దారుణ హత్యకు గురవుతాడు. అతనిని ఎవరు చంపారు? ఎందుకు చంపారు అనే దాన్ని ఇన్వెస్టిగేసన్ చేయడానికి క్రిమినాలజీలో ఎక్స్ పర్ట్ అయిన సనాతన్ సహాయం తీసుకుంటుంది పోలీసు డిపార్ట్ మెంట్. మరి విక్రమ్ చక్రవర్తి దారుణ హత్య వెనుక ఎవరున్నారు? ఎందుకు అతన్ని చంపారనేదాన్ని సనాతన్ ఏ విధంగా ఛేదించారనేదే మిగతా కథ.

కథ… కథనం విశ్లేషణ: వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు ఆది సాయికుమార్. ఇటీవలే ‘పులి మేక’ వెబ్ సిరీస్ తో మంచి అప్లాజ్ కూడా సంపాధించుకున్నాడు ఆది సాయికుమార్. ఇప్పుడు ‘సిఎస్ఐ సనాతన్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నటుడుగా మాత్రం ప్రతి సినిమా సినిమాకి చాలా బెటర్ అవుతున్నాడని చెప్పాలి. వైవిధ్యమైన పాత్రలు చేస్తూ… తనపని తాను చేసుకుంటూ వెళుతున్నారు ఆది సాయికుమార్. తాజాగా నటించిన సిఎస్ఐ సనాతన్ లో ఓ క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా బాగా సీరియస్ ఉన్న పాత్రలో నటించారు. ఇలాంటి కథలు ఇంతకు ముందు చాలా చూసుంటాం కానీ… కేవలం క్రైమ్ జరిగిన సీన్ ను బేస్ చేసుకుని… హత్యోదంతాన్ని ఛేదించడానికి రెండు గంటల పాటు కథనాన్ని నడిపించడం అంటే మాటలు కాదు. దాన్ని ఎంతో ఎంగేజింగ్ గా దర్శకుడు, హీరో ఆది సాయికుమార్ ముందుకు తీసుకెళ్లారు. ప్రథమార్థం మొత్తం… సీన్ లో లభ్యమైన, అందుబాటులో ఉన్న ఒక్కొక్క క్లూస్ ను విడదీసుకుంటూ వెళ్లి… ఇంటర్వెల్ తర్వాత అసలు కథను రివీల్ చేయడం ప్రేక్షకుల్ని ఎంతో థ్రిల్ కు గురిచేస్తుంది. ముఖ్యంగా విక్రమ్ చక్రవర్తి ఫ్లాష్ బ్యాక్ స్టోరీ నుంచి సినిమా గ్రాఫ్ అమాంతం పెరిగిపోతుంది. ఓ వరాల్ గా సిఎస్ఐ సనాతన్… మంచి ఎంగేజింగ్ థ్రిల్లర్.
ఆది సాయికుమార్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా సీరియస్ మోడ్ లో బాగా నటించారు. అతని ప్రేయసి పాత్రలో హీరోయిన్ కూడా తన పాత్రకు న్యాయం చేసింది. అలాగే నందిని రాయ్… ఎప్పటిలాగే ఆల్ట్రామెడ్రన్ గాళ్ గా దివ్య పాత్రలో మెప్పించింది. ఫైనాన్స్ కార్పొరేషన్ సీయీవో పాత్రలో కన్నడ నటుడు, కేజీఎఫ్ పేం తారక్ పొన్నప్ప నటన హైలైట్. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో అతని పాత్ర బాగా ఆకట్టుకుంటుంది. పొలిటికల్ లీడర్ పాత్రలో నటుడు మధుసూదన రావు ఆకట్టుకున్నాడు. ఆలీ రెజా… రుద్ర పాత్రలో హీరో స్నేహితుడిగా పర్వాలేదు అనిపిస్తాడు. మిగతా పాత్రలన్నీ తమ పరిధిమేరకు నటించి మెప్పించారు.

దర్శకుడు శివశంకర్ దేవ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విధానం చాలా ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ గా మెప్పించింది. నేపథ్య సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్ బాగుంది. సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. నిర్మాత అజయ్ శ్రీనివాస్ ఎక్కడా రాజీ పడకుండా సినిమాని చాలా క్వాలిటీగా నిర్మించారు. గో అండ్ వాచ్ ఇట్.
రేటింగ్: 3

నేడే విడుదల ఆకట్టుకుంటుంది

నేడే విడుదల ఆకట్టుకుంటుంది

ఐకా ఫిల్మ్ ఫాక్టరీ పతాకంపై అసిఫ్ ఖాన్ – మౌర్యాని జంటగా నటించిన చిత్రం “నేడే విడుదల”. నూతన దర్శకుడు రామ్ రెడ్డి పన్నాల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఈ రోజే (మార్చ్ 10) ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రాన్ని నజురుల్లా ఖాన్, మస్తాన్ ఖాన్ సంయుక్తంగా నిర్మించారు. ప్రచార చిత్రాలతో ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం ఆడియన్స్ ని ఏమాత్రం ఆకట్టుకుందో చూద్దాం పదండి.

కథ:
సినిమాలను ప్రమోషన్ చేసే ఓ కంపెనీలో సిద్ధూ(అసిఫ్ ఖాన్) పనిచేస్తూ ఉంటారు. అదే సమయంలో హారిక (మౌర్యాని)ని ప్రేమిస్తూ ఉంటాడు. నిర్మాత సత్యానంద్ (డైరెక్టర్ కాశీ విశ్వనాథ్) ఓ భారీ బడ్జెట్ మూవీని నిర్మించి… దానిని ప్రమోట్ చేయాల్సిందిగా సిద్ధూని కోరతాడు. సినిమాని ప్రమోట్ చేసి… ఓపెనింగ్స్ కూడా బాగా వచ్చేంతగా మూవీకి హైప్ తీసుకొస్తాడు సిద్ధూ. అంత బాగా ఓపెనింగ్స్ వచ్చిన సినిమా… పైరసీ బారిన పడి అనుకోకుండా డౌన్ ఫాల్ కావడంతో నిర్మాత సత్యానంద్ చనిపోతారు. అంత పెద్ద నిర్మాత మరణించడం సిద్ధూ జీర్ణించుకోలేకపోతాడు. అసలు నిర్మాత చనిపోవడానికి కారణాలు ఏంటి? అతని మరణం సమంజసమేనా? అంత మంచి టాక్ తెచ్చుకున్న సినిమాకి ఉన్నట్టుండి కలెక్షన్లు పడిపోవడానికి గల కారణాలను సిద్ధూ తెలుసుకున్నాడా? తెలుసుకుని ఉంటే ఏమి చేశాడు? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కథ… కథనం విశ్లేషణ:
యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాలు ఎప్పుడూ ఆహ్లాదకరంగానే ఉంటాయి. వాటికి కాస్త మెసేజ్ ఇచ్చే కంటెంట్ జోడిస్తే… బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తాయి. స్టోరీ పాయింట్ కొంచెం కొత్తగా ఉండి… దానికి ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే రాసుకుని… ఆడియన్స్ ఎంగేజ్ అయ్యేలా మూవీని తెరమీద చూపించగలిగితే… సినిమా తీసిన నిర్మాతలూ సేఫ్… దర్శకుడికి మంచి పేరు వస్తుంది. ఇలాంటి కాన్సెప్ట్ తోనే ‘నేడే విడుదల’ చిత్రం తెరకెక్కింది. ఆసక్తికరమైన కథ… కథనంతోపాటు… ఆలోచింపచేసే ఓ మెసేజ్ ను ఇందులో ఇచ్చాడు దర్శకుడు. అలాగే ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా సాగిపోయిన ఈ చిత్రంలోని సన్నివేశాలు… సెకండాఫ్ లో ఓవైపు ఫ్యామిలీ ఎంటర్టైన్ తో పాటు… మరోవైపు సినిమాలో అసలు కోర్ పాయింట్ కి కావాల్సిన మూలాలను వెతికే సన్నివేశాలను చూపించారు. సెకెండాఫ్ లో మంగళూరుకి స్టోరీ షిఫ్ట్ అయిన తరువాత హీరోయిన్ ఇంట్లో వచ్చే ‘శాకాహారం’ కామెడీ సరదాగా నవ్విస్తుంది. దానికి తోడు ఆహ్లదపరిచే సంభాషణల ఈ చిత్రానికి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎప్పుడూ రొటీన్ ఫుడ్ అలవాటు పడిన వారికి శాకాహారం తీసుకుంటే వారి జీవన శైలి ఎలా ఉంటుంది? వాటి వల్ల ఆయుష్షును ఎలా పెంచుకోవచ్చు? తదితర విషయాలన్ని ఆడియన్స్ కి పనికొచ్చేవే. అలాగే ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి తీసిన సినిమా… రిలీజైన వెంటనే సోషల్ మీడియాలో అప్ లోడ్ కావడం వల్ల నిర్మాతలు ఆర్థికంగా ఎలా నష్టపోతారనేది ఇందులో ఎంతో ఉద్వేగంగా చూపించారు. గతంలో ఇలాంటి కాన్సెప్ట్ లపై చాలా సినిమాలు ఉన్నా… ఇందులో దానికి పరిష్కారం చూపించడం కొత్తగా ఉంది.
హీరో ఆసిఫ్ ఖాన్ పాత్ర యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ఓ బాధ్యతగల యువకుని పాత్రలో చక్కగా నటించారు. యాక్షన్, రొమాంటిక్ సీన్స్ లో అలరించాడు. అతనికి జోడీగా నటించిన మౌర్యాని అటు గ్లామర్… ఇటు పర్ ఫార్మెన్స్ తో యువతను బాగా ఆకట్టుకుంటుంది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. నిర్మాత పాత్రలో దర్శకుడు కాశీవిశ్వనాథ్ కాసేపు కనిపించినా… మెప్పించారు. హీరో స్నేహితులగా నటించిన ఇద్దరూ ద్వితీయార్థంలో చక్కగా నవ్వించారు. ముఖ్యంగా సినిమా తారలను అనుకరించే పాత్రలో నటించిన నటుడు బాగా నవ్వించారు. హీరో తండ్రి పాత్రలో అప్పాజీ అంబరీషా తన పాత్ర పరిధి మేరకు నటించారు. మిగతా పాత్రల్లో నటించిన మాధవి, టి.ఎన్.ఆర్, అదుర్స్ ఆనంద్, పీలా గంగాధర్, జబర్దస్ నవీన్, అశోక వర్ధన్, రసజ్ఞ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. ముఖ్యంగా ఈ చిత్రంతో హీరోగా పరిచయమయిన అసిఫ్ ఖాన్ కి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని చెప్పొచ్చు. అతని నటన చాలా సహజంగా ఉంది.

ఇక దర్శకుడి విషయానికి వస్తే… సినీ పరిశ్రమ ప్రస్తుతం ఎలాంటి సమస్యతో ప్రధానంగా నష్టపోతోందో… ఆ అంశాన్ని ప్రధాన ఇతివృత్తంగా చేసుకుని… దాని చుట్టూ అల్లుకున్న కథనం… ఎంగేజింగ్ నడిపించడంలో దర్శకుడు రామ్ రెడ్డి పన్నాల విజయం సాధించారు. ఈ సినిమాకి అజయ్ అరసాడ అందించిన సంగీతం బాగుంది. పాటలు బాగున్నాయి. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పీగా ఉంటే బాగుండేది. సి హిచ్ మోహన్ చారి అందిచింన సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. హీరో, హీరోయిన్ జంటను అందంగా చూపించారు. నిర్మాతలు నజురుల్లా ఖాన్, మస్తాన్ ఖాన్ ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. చిన్న చిన్న లోపాలున్నా ఈ చిన్న సినిమా ఓవరాల్ గా చక్కగా ఎంటర్టైన్ చేస్తుంది!!
గో అండ్ వాచ్ ఇట్..!!!

రేటింగ్: 3/5

సాయి కుమార్ మరియు శ్రీనివాస్ రెడ్డి ప్రధాన పాత్రలో మూడో కన్ను సినిమా షూటింగ్ పూర్తి !

సాయి కుమార్ మరియు శ్రీనివాస్ రెడ్డి ప్రధాన పాత్రలో మూడో కన్ను సినిమా షూటింగ్ పూర్తి !

 

సెవెన్ స్టార్ క్రియేషన్స్ మరియు ఆడియన్స్ పల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ద్వారా సునీత రాజేందర్, ప్లాన్ బి డైరెక్టర్ కె.వి రాజమహికి నిర్మిస్తున్న చిత్రం మూడో కన్ను. అమెరికాలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా నిర్మిస్తున్న ఈ ఆంథాలజీ చిత్రానికి నలుగురు కొత్త దర్శకులయిన సూరత్ రాంబాబు, కె బ్రహ్మయ్య ఆచార్య, కృష్ణమోహన్, మావిటి సాయి సురేంద్రబాబు వీళ్ళని పరిచయం చేస్తున్నారు. నాలుగు కథలు, నలుగురు దర్శకులు, ఈ కథలో ప్రధాన పాత్ర పోషించిన సాయికుమార్ మాట్లాడుతూ : కొత్త కథతో వస్తున్న కొత్త వాళ్లను ఎంకరేజ్ చేయడానికి ఈ సినిమా చేస్తున్నానని, ఈ సినిమా చేయడం నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పారు.
ఈ చిత్రంలో మరో ప్రధాన పాత్ర చేస్తున్న శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ : కథ అత్యంత ఉత్కంఠ భరితంగా ఉంటుందని చెప్పారు.
అలాగే తెలుగు ఫిలిం దర్శకుల సంఘం అధ్యక్షుల కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ ఫస్ట్ టైం తెలుగు ఫిలిం చరిత్రలో మా యూనియన్ లో మెంబర్ షిప్ ఉన్న నలుగురు కొత్త దర్శకులను ఇంటర్ డ్యూస్ చేస్తున్న మా మెంబెర్ దర్శకుడు కె.వి రాజమహికి ధన్యవాదాలు. ఈ చిత్రంలో నేను కూడా భాగమైనందుకు ఆనందంగా ఉందని చెప్పారు. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన సూర్య, మహేష్ వడ్డి, నిరోష, కౌశిక్ రెడ్డి, ప్రదీప్ రుద్ర, దయానంద రెడ్డి, శశిధర్ కౌసరి, దేవి ప్రసాద్, మాధవి లత, చిత్రం శ్రీను, సత్య శ్రీ, మధు, దివ్య, వీర శంకర్, రూప, ఇంకా పలుగురు మాట్లాడుతూ ఈ చిత్రం అందరూ చూడదగిన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ అని, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించబోతున్న కొత్త కాన్సెప్ట్ అని, కొత్త టాలెంట్ తో వస్తున్న ఈ చిత్రాన్ని అందరూ ఆదరించాలని కోరుకున్నారు.
అలాగే ఈ చిత్ర నిర్మాతలైన కె.వి రాజమహి మరియు సునీత రాజేందర్ లు మాట్లాడుతూ ఈ చిత్రంలో నటించిన సాయికుమార్, శ్రీనివాసరెడ్డి, కాశీ విశ్వనాథ్ మరియు ఇతర నటీనటులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు చెప్పారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ చిత్రాన్ని ఆదరించాలని వేడుకున్నారు. ఈ చిత్రానికి కథ కథనం మాటలు కె.వి రాజమహికి షూటింగ్ ఫినిష్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ చిత్రం ఏప్రిల్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

నటీనటులు:
సాయికుమార్
శ్రీనివాస్ రెడ్డి
నిరోషా
కాశి విశ్వానాథ్
మాధవి లత
ప్రదీప్ రుద్ర
దేవి ప్రసాద్
సూర్య
మహేష్ వడ్డి
చిత్రం శ్రీను
దయానంద్ రెడ్డి
శశిధర్ కౌసూరి
కౌశిక్
సత్య
వీర శంకర్

సాంకేతిక నిపుణులు :

డైరెక్టర్స్ :
సూరత్ రాంబాబు ,
కే బ్రహ్మయ్య ఆచార్య ,
కృష్ణమోహన్ ,
మావిటి సాయి సురేంద్రబాబు,
ప్రొడ్యూసర్స్ :
సునీత రాజేందర్.డి ,
కెవి రాజమహే ,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ :
సాయి సూరజ్ ,
శ్రీనివాస్ కాలంచ.
స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ : కెవి రాజమహి
మ్యూజిక్ :స్వర
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : అనపర్తి నారాయణ
డిఓపి :
ముజీర్ మాలిక్
అక్షయ్ శ్రీధర్
వెంకట మన్నం
ఎడిటర్ : జయకుమార్
ఫైట్స్ : శంకర్ ఉయ్యాల
లిరిక్స్ : మామిడి అక్షిత
కొరియోగ్రాఫర్ : రాజు పైడి
ఆర్ట్ : క్రిష్ణ చిత్తనూర్
కాస్ట్యూమ్ డిజైనర్ : సాయి శ్రీయ
స్క్రిప్ట్ అసోసియేట్స్ :
ఎస్ దేవేంద్ర డాక్టర్,
బైరి నిరంజన్
అడిషనల్ డైలాగ్స్ :
మౌనశ్రీ మల్లిక్
పిఆర్ఓ శ్రీపాల్ చొల్లేటి
వీఎఫ్ఎక్స్ : సతీష్ కుమార్ కోరుకొండ

వేట  సినిమాతో కథానాయకుడిగా తొలి అడుగు వేయబోతున్నాడు!

వేట సినిమాతో కథానాయకుడిగా తొలి అడుగు వేయబోతున్నాడు!

వేట అనే సినిమాతో P.Sriram (పి. శ్రీరామ్ ) కథానాయకుడిగా తొలి అడుగు వేయబోతున్నాడు. మంగళవారం ఈ సినిమా రిలీజ్ పోస్ట‌ర్‌ను నంద‌మూరి చైతన్య కృష్ణ రిలీజ్ చేశారు. న‌టుడిగా గ‌తంలో ప‌లు సినిమాలు చేశాడు శ్రీరామ్. వేట సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు.బి వి వి ఆర్ క్రియేషన్స్ పతాకంపై ఎ. హరిత నిర్మాత గా ఈ వేట చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి కిషోర్ శ్రీ క్రిష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో రిలీజ్ అయినటువంటి “సిందూరం ” సినిమాకి ఈయన రచయిత. ఈ చిత్రానికి కెమెరామన్ గా బాలు ఎబిసిడి , బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను అజయ్ పట్నాయక్ అందించారు ఈ చిత్రాన్ని చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు ఎన్నో సినిమాలను రిలీజ్ చేస్తూ నూతన దర్శకులను, నిర్మాతలను ప్రోత్సహిస్తున్న బి సి ని ఈటి ఓటిటి (BCINEET OTT) సంస్థ ద్వారా బి సిని ఈటి ఓటిటి (BCINEET OTT) తో పాటూ అమెజాన్ ప్రైమ్ ఓవర్సీస్ , ఎంఎక్స్ ప్లేయర్, హంగామా ప్లే, విఐ మూవీస్ & టీవీ , ఎం ఐ టీవీ, ఫైర్ స్టిక్ ఇలా బి సిని ఈటి ఓటిటి (BCINEET OTT) సంస్థతో అనుసంధానమైన మరిన్ని 20 ఓటిటి ప్లాట్ఫామ్ లలో ఉగాది కానుక గా రిలీజ్ చేస్తున్నట్లు బి సి ని ఈటి ఓటిటి(BCINEET OTT) సంస్థ అధినేత డీకే బోయపాటి మీడియాకు వెల్లడించారు.

ఘనంగా శ్రీ శంకర్ ఆర్ట్స్ పరారీ మూవీ పోస్టర్ మరియు సెకెండ్ టీజర్ ఆవిష్కరణ*

ఘనంగా శ్రీ శంకర్ ఆర్ట్స్ పరారీ మూవీ పోస్టర్ మరియు సెకెండ్ టీజర్ ఆవిష్కరణ*

*

పరారీ మూవీ పోస్టర్ ను ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు బసిరెడ్డి ఆవిష్కరించారు.టీజర్ ను ప్రొడ్యూసర్ కౌన్సెల్ అధ్యక్షులు దామోదర్ ప్రసాద్ ఆవిష్కరించారు.

శ్రీ శంకర ఆర్ట్స్ బ్యానర్ లో, గాలి ప్రత్యూష సమర్పణలో, యోగేశ్వర్ అతిధి జంటగా, సాయి శివాజీ దర్శకత్వంలో, జి వి వి గిరి నిర్మించిన చిత్రం పరారీ.. ఈ చిత్రం మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది..ఈ సందర్భంగా ఫిలిం ఛాంబర్ లో ఈ మూవీ పోస్టర్ మరియు సెకెండ్ టీజర్ ను ఆవిష్కరించారు

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత జి వి వి గిరి మాట్లాడుతూ: ఒక లక్యంతో ఈ సినిమాని నిర్మించాను. చక్రి తమ్ముడు మహిత్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు.నేను సుమన్ గారి అభిమానిని.ఆయన వందవ సినిమా మేము చెయ్యాలి కానీ అది అవ్వలేదు.ఈ మూవీ లో సుమన్ మంచి క్యారెక్టర్ చేశారు అలీ షయాజి షిండే, మకరంద్ దేశ ముఖ్ కీలక పాత్రల్లో నటించారు.ఈ నెల 30న సినిమా రిలీజ్ అవుతుంది. మంచి కథ కథనాలతో తెరకెక్కిన పరారీ అందరిని మెప్పిస్తుంది అని అన్నారు

సంగీత దర్శకుడు మహిత్ నారాయణ్ మాట్లాడుతూ: హీరో యోగేశ్వర్ ఎక్స్పిరియన్స్ ఆర్టిస్టు లా నటించాడు. సినిమాలో పాటలు అన్ని బాగా వచ్చాయి. ఈ సినిమా ద్వారా నాకు మంచి పేరు వస్తుంది. సినిమా పెద్ద హిట్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. నిర్మాత ఎక్కడ ఖర్చుకు వెను కాడకుండా నిర్మించారు. నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతకు థాంక్స్ అని అన్నారు.

ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు బసిరెడ్డి మాట్లాడుతూ: టీజర్ నాకు బాగా నచ్చింది. కంటెంట్ ఉంటే సినిమా హిట్. సినిమాకి నిర్మాత బాగా ఖర్చుపెట్టి తీశారు అది విజువల్ గా కనపడుతుంది.హీరో కి ఆల్ దీ బెస్ట్..మహిత్ కి అల్ డి బెస్ట్.సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి అని అన్నారు.

ప్రముఖ దర్శకుడు జె జె ప్రకాష్…నిర్మాత గిరి గారు అబ్బాయి ఈ సినిమా తో హీరోగా పరిచయం అవుతున్నారు. అల్ ది బెస్ట్ యోగిశ్వర్. టీజర్ బాగుంది. సినిమా పెద్ద హిట్ అయ్యి చిత్ర బృందానికి మంచి పేరు తీసుకు రావాలి..మహిత్ సాంగ్స్ బాగున్నాయి అని అన్నారు

నిర్మాత ఓలి మాట్లాడుతూ:
ఈ సినిమాని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. హీరో బాగా నటించారు. నిర్మాత ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు.చాలా రిచ్ గా తీశారు అందరికి ఆల్ ది బెస్ట్ అన్నారు.

డిస్ట్రిబ్యూటర్ శక్తి రమేష్ మాట్లాడుతూ: యోగేశ్వర్ కొత్త యాక్టర్ లా కాకుండా చాలా మెచ్యూర్డ్ ఆర్టిస్ట్ గా నటించారు..చిత్ర బృందానికి అల్ ది బెస్ట్ అన్నారు.

నిర్మాతల మండలి అధ్యక్షులు దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ:
నిర్మాత గిరి గారు నాకు మంచి మిత్రుడు..రెండు సంవత్సరాలు క్రితం కలిసినప్పుడు ఈ సినిమా గురించి చెప్పారు..తన కొడుకే హీరో అని చెప్పలేదు..ఆడియో ఫంక్షన్ లో గిరి గారి అబ్బాయి హీరో అని తెలిసింది..యోగేశ్వర్ ముందు చదువు కాంప్లిట్ చెయ్యమని చెప్పాను. ఇప్పుడు ఐ ఏ ఎస్ చదువుతున్నాడు..ఈ జనరేషన్ కి సరిపోయే కంటెంట్ ఉన్న సినిమ పరారీ. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి అని కోరుకుంటున్నాను.ఎంటర్ యూనిట్ కి ఆల్ ది బెస్ట్ అన్నారు..

యోగేశ్వర్, అతిధి, సుమన్, భూపాల్, శివాని సైని, రఘు కారుమంచి, మకరంద్ దేశముఖ్, షయాజి షిండే, అలీ , శ్రవణ్, కల్పాలత, జీవ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం మహిత్ నారాయణ్, లిరిక్ రైటర్స్: రామజోగయ్య శాస్త్రి, భాస్కర భట్ల, సినిమాటోగ్రఫీ; గరుడ వేగా అంజి, ఎడిటర్ గౌతమ్ రాజు, ఆర్ట్స్; ఆనంద్, కోటి అబలయ్, యాక్షన్ :నందు, కొరియోగ్రఫీ: జానీ, భాను, నిర్మాత: జి వి వి గిరి, దర్శకత్వం: సాయి శివాజీ