9010892345 Whatsup moviepromotion.pro@gmail.com
Select Page
‘ప్రేమదేశపు యువరాణి’ మువీ ట్రైలర్ లాంచ్ చేసిన మాస్ క దాస్ ‘విశ్వక్సేన్

‘ప్రేమదేశపు యువరాణి’ మువీ ట్రైలర్ లాంచ్ చేసిన మాస్ క దాస్ ‘విశ్వక్సేన్

యామిని రాజ్, విరాట్ కార్తీక్, యామిన్ రాజ్, ప్రియాంక రెవ్రి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సాయి సునీల్ నిమ్మల దర్శకత్వం వహించాడు. ఆనంద్ వేమూరి, హరిప్రసాద్ సి. హెచ్ నిర్మాతలుగా వ్యవహరించారు.

ట్రైలర్ రిలీజ్ అనంతరం హీరో విశ్వక్సేన్ మాట్లాడుతూ.. “ప్రేమదేశపు యువరాణి’ టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్. మేము తీసి ఫస్ట్ సినిమా కంటే చాలా బెటర్ గా ఈ సినిమా తీశారు. హీరో యామినిరాజ్, కిరాక్ కార్తీక్లలు చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. ఈ సినిమా అందరికీ మంచి పేరు తీసుకురావాలి ఆల్ ద బెస్ట్” అని అన్నారు.

డైరెక్టర్ సాయి సునీల్ నిమ్మల మాట్లాడుతూ.. “మాస్కా దాస్ విశ్వక్సేన్ స్టార్ యాక్టర్గా ఎదిగాడు. అలాంటి వ్యక్తి మా టీజర్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా వుంది. మా టీజర్ని విశ్వక్సేన్ అన్న 3 టైమ్స్ ప్లే చేసుకుని చూసి మా చిత్రాన్ని.. టీమ్ అందరినీ అభినందించారు. మమ్మల్ని నమ్మి ఈ చిత్రాన్ని మంచి బడ్జెని అందించిన మా నిర్మాతలు ఆనంద్ వేమూరి గారికి, హరిప్రసాద్ సి.హెచ్. గారికి ధన్యవాదాలు. మా హీరో యామిని రాజ్ కూడా చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశాడు. సెకండ్ హీరో కిరాక్ కార్తీక్ గారు కూడా చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. ప్రియాంక రెన్రి హీరోయిన్, పవన్ ఈ సినిమాలో విలన్ గా చేశాడు. మా నటీనటులందరికీ థ్యాంక్స్. అందరూ చాలా మంచిగా పెర్ఫార్మ్ చేశారు. విశ్వక్ అన్న ఇందాక అడిగాడు విజువల్స్ చాలా బాగున్నాయి.. మీ కెమెరామెన్ ఎవరు అని? మా కెమెరా మెన్ శివ. శివగారికి థ్యాంక్స్. ఇంత మంచి సినిమాటోగ్రఫీ మాకు అందించినందుకు. మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ పట్నాయక్ కూడా మంచి సంగీతం అందించారు. మా చిత్రంలో లవ్, కామెడీ, ఎమోషన్ అన్ని వుంటాయి. ప్రేక్షకులకు ఓ సరికొత్త కథను ఎంజాయ్ చేస్తారు. ఖచ్చితంగా ఈ చిత్రం అందరికీ మంచి పేరు తీసుకువచ్చి హిట్ అవుతుందని అందరికీ ఒక ప్రొఫైల్లా నిలుస్తుందనడంలో సందేహం లేదు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. హిట్ కొట్టడం గ్యారంటీ… అందరూ చాలా హ్యాపీగా వున్నాం. ప్రస్తుతం మా టీమ్ లో వున్న రెస్పాన్స్ రేపు యూట్యూబ్లోనే కాకుండా చూసే డిస్ట్రిబ్యూటర్స్ అందరూ సినిమాని కొని మా నిర్మాతలకి పెట్టిన డబ్బులకి రెట్టింపు రావాలని కోరుకుంటున్నాను. మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు. చిన్న చిత్రాలని మీరు ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టే మాలాంటి కొత్తవాళ్ళు ఇండస్ట్రీకి వచ్చి సినిమాలు చేయగలుగుతున్నాం మీ సపోర్ట్ ఇలాగే వుండాలి. అందరికీ అందరికీ ధన్యవాదాలు” అని అన్నారు.

పవన్ కుమార్ ముత్యాల మాట్లాడుతూ.. “ఈ చిత్రంలో నేను విలన్ కొడుకుగా నటించాను. ఫుల్ లెంగ్త్ పాత్ర చాలా పవర్ఫుల్గా వుంటుంది. విశ్వక్సేన్ అన్నకి థ్యాంక్స్ సపోర్ట్ చేసినందుకు. మా దర్శకులు సాయి సునీల్గారికి, నిర్మాత ఆనంద్ వేమూరి గారికి, హరిప్రసాద్ గారికి థ్యాంక్స్. నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు.. నన్ను ప్రోత్సహించినందుకు. అలాగే మా హీరో గారికి కంగ్రాట్స్. ఇలాంటి మంచి సినిమాలు ఎన్నో చేయాలి. మీడియా మిత్రులందరూ చిన్న సినిమాలను ఇలాగే ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.

ఈ చిత్రంలో మెహబూబ్ బాష, హరికృష్ణ, యోగి కత్రి, రఘు, సునీత మనోహన్, పవన్ ముత్యాల, రాజా రెడ్డి, సందీప్, శ్రవంతి, బండ సాయి, బక్క సాయి, ప్రత్యూష, గోపి, నాయుడు తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎడిటర్ : యం.ఆర్. వర్మ, డిఒపి : శివ కుమార్ దేవరకొండ, సంగీతం : అజయ్ పట్నాయక్, లిరిక్స్ : కాసర్ల శ్యామ్, సాయి సునీల్ నిమ్మల, భాను కృష్ణ, కొరియోగ్రఫీ : కపిల్, శ్రీవీర్, సౌండ్ ఎఫెక్ట్స్ : పురుషోత్తం రాజు, ఫైట్స్ : శివ్రాజ్ మాస్టర్, డి.ఐ. : వెంకట్, పి.ఆర్.ఒ. : సినీలోకం బాబు నాయక్ (సినీ సందడి) నిర్మాతలు : ఆనంద్ వేమూరి, హరిప్రసాద్ సి. హెచ్, రచన & దర్శకత్వం : సాయి సునీల్ నిమ్మల.

ఫుల్ అవుట్ & అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ “బ్రహ్మచారి” విడుదలకు సిద్ధం”

ఫుల్ అవుట్ & అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ “బ్రహ్మచారి” విడుదలకు సిద్ధం”

అద్వితీయ ఎంటర్టెయినర్స్ మరియు పొడిచేటి మూవీ మేకర్స్ సంయుక్త నిర్మాణంలో, నర్సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన “బ్రహ్మచారి” చిత్రం సెన్సార్ కి చేరింది. త్వరలో విడుదల కానున్న ఈ చిత్ర కథ టూకీగా…దుబాయ్ కి వెళ్లి వచ్చిన ఒక అబ్బాయి పెళ్లి చేసుకుందామనుకున్న టైంలో అమ్మాయి దొరకక ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కున్నాడు ? చివరి కేం జరిగింది అనేది.

వెండితెరకు దర్శకుడుగా పరిచయం కాబోతున్న కొత్త కెరటం నర్సింగ్ దర్శకత్వంలో నూతన నటీనటులతో , బి. రాంభూపాల్ రెడ్డి నిర్మిస్తున్న పక్కా తెలంగాణ కామెడీ చిత్రం “బ్రహ్మచారి'”.ఈ చిత్రం విడుదలకు అన్ని హంగులతో సిద్ధమైంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

*సాంకేతిక నిపుణులు*
బ్యానర్ : అద్వితీయ ఎంటర్టెయినర్స్,
నిర్మాత : బి. రాంభూపాల్ రెడ్డి ,
స్టోరీ , స్క్రీన్ ప్లే , డైరెక్షన్ : నర్సింగ్ ,
సినిమాటోగ్రఫీ ; కర్ణ ,
డైలాగ్స్ అండ్ లిరిక్స్ : దోరవేటి ,
మ్యూజిక్ : పాండురంగ,
బి. జి. యం : ఎల్. ఎం. ప్రేమ్ ,
కొరియోగ్రఫీ : రజాక్
కో ప్రొడ్యూసర్స్ : చిట్టిబాబు, హస్సన్ జావిద్
ఆర్ట్ డైరెక్టర్ : నరేందర్
ఎడిటర్ : సాయి ఆకుల విజయ్
స్టంట్స్ : ఖురేషీ
ప్రొడక్షన్ మేనేజర్ : భాస్కర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : చిట్టిబాబు
కాస్ట్యూమ్ డిజైనర్ : విజయ్
పోలేపల్లి ,
పి. ఆర్. ఓ : గోపి

8 AM Metro సినిమా కి నూరాన్ సిస్టర్స్ తో పాట పాడించిన మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ కె. రాబిన్

8 AM Metro సినిమా కి నూరాన్ సిస్టర్స్ తో పాట పాడించిన మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ కె. రాబిన్

8 AM Metro సినిమా కి నూరాన్ సిస్టర్స్ తో పాట పాడించిన మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ కె. రాబిన్

నూరాన్ సిస్టర్స్ పేరు తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. సూఫీ నేపధ్యంలో వాళ్ళు పాడిన ఎన్నో పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ప్రస్తుతం 8 AM Metro అనే సినిమా కోసం వాళ్ళు పాడిన పాట శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈద్ పండుగ సందర్భంగా “Woh Kuda” అనే ఈ పాటను మూవీ టీం రిలీజ్ చేసారు. ఈ సాంగ్ వీడియో లో నూరాన్ సిస్టర్స్ అయిన సుల్తానా నూరాన్, జ్యోతి నూరాన్ ఇద్దరూ పాట పాడుతూ కనపడటం విశేషం.

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మల్లేశం, జాంబీరెడ్డి, ఘోస్ట్ వంటి తెలుగు హిట్ మూవీస్ కి మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించిన మార్క్ కె. రాబిన్ ఈ సినిమాకు స్వరాలందించారు. ప్రస్తుతం వస్తున్న పెద్ద బాలీవుడ్ సినిమాల పాటలకు సరి తూగే విధంగా ఈ సాంగ్ ఉందని మ్యూజిక్ లవర్స్ అభిప్రాయపడుతున్నారు. మల్లేశం మూవీ డైరెక్టర్ రాజ్.ఆర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మల్లేశం సినిమాకు జాతీయ స్థాయిలో ప్రసంశలతో పాటు అవార్డ్స్ కూడా వచ్చాయి.

“హేట్ స్టొరీ”, “హంటర్” లాంటి సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితుడైన గుల్షన్ దేవయ్య ఈ సినిమాలో హీరో గా నటిస్తున్నారు. సుప్రీం హీరో సాయి ధరం తేజ్ మొదటి సినిమా “రేయ్” సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయిన సయామీ ఖేర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ కి కూడా చాలా మంచి స్పందన వచ్చింది. మెట్రో ట్రైన్ లో ప్రయాణం చేసే ఇద్దరు వ్యక్తుల మధ్య మొదలయిన పరిచయం నెమ్మదిగా స్నేహంగా మారి చివరకు ఏమయ్యింది.? అన్నట్లుగా ఉన్న కథను దర్శకుడు ముందే ఆడియన్స్ కి రివీల్ చేసేసారు.

ఈ సినిమాకు సంబంధించి మిగిలిన పాటలు కూడా త్వరలో రిలీజ్ అవబోతున్నాయి. కిషోర్ గంజి, రాజ్ .ఆర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా మే 19 న థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది.

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ‘ఊరికి ఉత్తరాన’

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ‘ఊరికి ఉత్తరాన’

నరేన్ వనపర్తి, దీపాళి శర్మ నటించిన చిత్రం ‘ఊరికి ఉత్తరాన’. తన బృందంతో కలిసి సతీష్ దర్శకత్వం వహించారు. వనపర్తి వెంకటయ్య నిర్మించారు. ఈచిత్రం థియేటర్లలో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఈ సినిమా ప్రముఖ OTT సంస్థ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ సంద‌ర్భంగా నిర్మాత వ‌న‌ప‌ర్తి వెంకటయ్య మాట్లాడుతూ… మా చిత్రాన్ని థియేటర్లలో అదరించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇప్పుడు OTTలో స్ట్రీమింగ్ అవుతోంది. మంచి మెసేజ్ వున్న సినిమా అన్నారు.

ఈ సదర్భంగా దర్శకుడు మాట్లాడుతూ “గ్రామీణ నేపథ్యంలో సాగే కథ ఇది. ప్రేమతోపాటు, ఆసక్తి రేకెత్తించే అంశాలు పుష్కలంగా ఉన్నాయ”న్నారు. కథానాయకుడు నరేన్ మాట్లాడుతూ “ఈ సినిమా కోసం వరంగల్ సెట్ వేసి చిత్రీకరణ చేశాం. అది సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. మనసుల్ని హత్తుకునే కథ, కథనాలతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకి చక్కటి వినోదం పంచుతుంది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. కేవలం రూ.79 చెల్లించి ఈ సినిమా ఇంటిల్లపాది చూడొచ్చు. ప్రస్తుతం ఈగల్ ఐ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై ఓ కొత్త దర్శకుడితో ఓ సినిమా చేస్తున్నట్లు” తెలిపారు.

ఈ చిత్రంలో రామరాజు, మల్లేశం ఫేం ఆనంద చక్రపాణి, అంకిత్ కొయ్య, ఫణి, జగదీష్ లు ప్రధాన పాత్రల్లో న‌టిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీః శ్రీకాంత్ అరుపుల‌; సంగీతంః భీమ్స్ సిసిరోలియో- సురేష్ బొబ్బిలి; సాహిత్యంః సురేష్ గంగుల‌, పూర్ణాచారి; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : మాల్యా కందుకూరి ; నిర్మాతః వ‌న‌ప‌ర్తి వెంక‌ట‌య్య‌, ద‌ర్శ‌క‌త్వంః స‌తీష్ అండ్ టీమ్

దగ్గుపాటి సురేష్ బాబు గారి చేతుల మీదుగా “మన్యం రాజు ” టీజర్ రిలీజ్

దగ్గుపాటి సురేష్ బాబు గారి చేతుల మీదుగా “మన్యం రాజు ” టీజర్ రిలీజ్

దగ్గుపాటి సురేష్ బాబు గారి చేతుల మీదుగా “మన్యం రాజు ” టీజర్ రిలీజ్

జీవన్ హీరోగా, బేబీ పరిణిక మరియు సోమ సుందరం.బి యమ్, ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం మన్యం రాజు వాయుపుత్ర ఆర్ట్స్ బ్యాన‌ర్ పై, ఈ చిత్రం నిర్మాణం పూర్తి చేసుకుంది. రామానాయుడు ప్రివ్యూ థియేటర్ లో టీజర్ సురేష్ బాబు చేతులమీదుగా రిలీజ్ చేయటం జరిగింది.

సురేష్ బాబు గారు మాట్లాడుతూ ఈ సినిమా టీజర్ చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది, సినిమా చూడాలి అని కూతుహలాన్ని రేపుతుంది, సినిమా ఖచ్చితంగా తెలుగులో సక్సెస్ అవ్వాలని.. ప్రొడ్యూసర్ కి మరియు డైరెక్టర్ కి , మరిన్ని అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. సినిమా లో పని చేసిన వాళ్ళ అందరికి అల్ బెస్ట్ చెప్తున్నాను.
హీరో సప్తగిరి గారు మాట్లాడుతు టీజర్ చాల బాగా వచ్చింది ఈ సినిమా మంచి ఘన విజయం సాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

హీరో జీవన్ గారు మాట్లాడుతూ సురేష్ బాబు గారి చేతుల మీదుగా టీజర్ రిలీజ్ చేయటం చాల ఆనందంగా ఉంది . సినిమా చాల బాగా వచ్చింది. మీకు తప్పకుండ నచ్చుతుంది అని నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి , మరియు డైరెక్టర్ సోము గారికి థాంక్స్ చెప్తూకుంటున్నాను.

దర్శకుడు సోమసుందరం.బి యమ్, మాట్లాడుతూ ” మా సినిమా టీజర్ విడుదల చేసిన సురేష్ బాబు గారికి నా హృదయపూర్వక ధన్యవాదలు , కష్టపడి సినిమా చేశాం . టీజర్ కూడా బాగా నచ్చుతుంది అని ఆశిస్తున్నాను. మా హీరో జీవన్ , గారు మరియు ప్రొడ్యూసర్ గారు ఆయన నా మీద ఉంచిన నమ్మకాన్ని జయించాను అనే అనుకుంటున్నాను ” అని అన్నారు. నా నా మీద నమ్మకం తో ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి కూడా థాంక్స్ చెప్తున్నాను.

ప్రొడ్యూసర్స్ విజయ్ బాబు , ప్రవీణ్ , భీమాస్ అశోక్ వారు మాట్లాడుతూ ” సురేష్ బాబు గారి చేతుల మీదుగా మా సినిమా టీజర్ రిలీజ్ అయినందుకు ఆనందం గా ఉంది. మేము అనుకున్నట్టే చాలా బాగా వచ్చింది సినిమా , జీవన్ గారి కెరీర్ లో మరొక మంచి సినిమా అవుతుంది అని మేమంతా గట్టిగా నమ్ముతున్నాం” అని అన్నారు ఈ సినిమా ఈ ఏడాది సమ్మర్ లో రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకొని మే లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నాము. ఈ కార్యక్రమ లో పరిపూర్ణానంద స్వామి గారు ,యం వి వి సత్యనారాయణ గారు , సప్తగిరి ప్రసాద్ గారు , లయన్ వెంకట్ గారు ,ప్రద్యుమ్న గారు పాల్గొన్నారు .

సుమన్,జీవన్ ,భీమాస్ అశోక్ , జయచంద్ర , బేబీ పరిణిక, తదితరులు నటిస్తున్నారు .

డైరెక్టర్ : సోమసుందరం బి యఎం,
ప్రొడ్యూసర్ : వై ప్రవీణ్ , విజయ్ బాబు , పుష్పలత. బి
మ్యూజిక్ డైరెక్టర్ : ఫ్రాంక్లిన్ సుకుమార్
కెమెరా మెన్ : రమేష్ మెండే, కృష్ణ వంశీ .
కో – ప్రొడ్యూసర్స్ : భీమాస్ అశోక్ , వంశి పాలకూరు, మురళి ప్రసాద రావు,
కోరియోగ్రాఫర్ : పవన్ విక్కీ
పి ఆర్వో : శ్రీపాల్ చొల్లేటి

అమెజాన్ లో నీతో చిత్రం ట్రెండింగ్ !!!

అమెజాన్ లో నీతో చిత్రం ట్రెండింగ్ !!!

Neetho movie trending on Amazon prime !!!

“నీతో”.. సున్నితమైన అంశాలను స్పృశిస్తూ దర్శకుడు బాలు శర్మ రాసుకున్న కథాంశం, అలాగే తమ మధ్యన ఏర్పడిన ప్రేమ బంధానికి సరైన నిర్వచనాన్ని వెతకడానికి నాయకా, నాయికలు ప్రయత్నించే తీరు ఆసక్తికరంగా సాగుతుంది.

నీతో హీరో అభిరామ్ వర్మ్ చాలా ఈజ్‌తో నటించాడు. కొన్ని సీన్స్‌‌లో ఫీల్‌ను కళ్ళతో బాగా ఎలివేట్ చేశాడు. అలాగే కథానాయిక సాత్విక రాజ్ కూడా మంచి పరిణితితో కూడిన నటనను కనబరిచింది. హీరో చిన్నాన్న పాత్రలో రాజీవ్ కనకాల కూడా బాగా నటించారు. ఆయన నటనానుభవం ఆ పాత్రలో ప్రస్ఫుటితంగా కనిపించింది.

థియేటర్స్ లో ప్రేక్షకులను అలరించిన నీతో సినిమా ఇప్పుడు ప్రముఖ ఓటిటి అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. అమెజాన్ లో విడుదలైన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ సినిమాకు మిలియన్ వ్యూస్ రావడంతో పాటుగా ట్రేండింగ్ లో ఉండడం విశేషం. పృథ్వీ క్రియేషన్స్, మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి.

 

Check it out now on Prime Video!
https://app.primevideo.com/detail?gti=amzn1.dv.gti.fd891626-a832-4972-8ef4-f8902f2de0bd&ref_=atv_dp_share_mv&r=web