9010892345 Whatsup moviepromotion.pro@gmail.com
Select Page
ఎంగేజింగ్ పొలిటికల్ హారర్ థ్రిల్లర్

ఎంగేజింగ్ పొలిటికల్ హారర్ థ్రిల్లర్

తారకరత్న, ప్రిన్స్, సునీల్, అలీ, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో భరత్ కోమలపాటి(సన్నీ కోమలపాటి) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం S5 No Exit. శౌరీ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై
ఆదూరి ప్రతాప్ రెడ్డి, దేవు శామ్యూల్, షైక్ రెహీమ్, మెల్కి రెడ్డి గాదె,
గౌతమ్ కొండెపూడి నిర్మించారు. హర్రర్ థ్రిల్లర్ కి… కాస్త పొలిటికల్ డ్రామాను జోడించి తెరకెక్కిన ఈ చిత్రం ఈ రోజే విడుదలయింది. మరి ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమాత్రం అలరించిందో చూద్దాం పదండి.

సినిమా కథ: ప్రజాసేవ పార్టీ ముఖ్యమంత్రి(సాయి కుమార్) తనయడు సుబ్బు(తారకరత్న) తన పుట్టిన రోజు వేడుకలను హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్లే ట్రైన్ లోని ఎస్5 బోగీలో జరుపుకోవాలని తండ్రి ప్లాన్ చేస్తారు. దాంతో సుబ్బు తన మిత్రులతో కలిసి తన పుట్టినరోజు వేడుకలను ఎస్5 బోగీలో జరుపుకుంటూ… వైజాగ్ వెళుతుంటే మధ్యలో సన్నీ(ప్రిన్స్) తన డ్యాన్స్ బృందంతో కలిసి అదే బోగీలో అనుకోకుండా ఎక్కుతాడు. అక్కడ సుబ్బు, సన్నీ బ్యాచ్ కి ఒకరంటే ఒకరు గిట్టకుండా… అస్తమాను తగువులాడుతూ ప్రయాణం చేస్తూ ఉంటారు. అయితే ఉన్నట్టుండి ఆ కోచ్ లో ఒక్కొక్కరూ మాయం అవుతూ… ఆ కోచ్ తలుపులు తెరుచుకోకుండా సుబ్బు అండ్ సన్నీ బ్యాచ్ ని ఏదో ఒక తెలియని భూతం హింసిస్తూ ఉంటుంది. ఒక్కొక్కరుగా మాయమవుతూ ఉంటే… చివరకు సుబ్బు అతని స్నేహితుడు సంజయ్ తో కలిసి ట్రై నుంచి దూకేసి ప్రాణాలు కాపాడుకుంటారు. మరి ఇలా ప్రాణాలు కాపాడుకున్న వీళ్లని ఎస్5 కోచ్ లో ఎవరు ఇబ్బంది పెట్టారు? ఎందుకు వాళ్లని హింసించారు? చనిపోయిన వాళ్లంతా ఏమయ్యారు? ఆ కోచ్ లో వున్న దెయ్యం ఎవరు? చివరకు ఎలాంటి నిజాలు బయటకు వచ్చాయి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కథ… కథనం విశ్లేషణ: తారకరత్న ఇటీవల కాస్త వైవిధ్యం ఉన్న పాత్రలను ఎంచుకుని సినిమాలు చేస్తున్నారు. గతంలో కూడా అమరావతి లాంటి సినిమాలో విలనిజం వున్న పాత్రను చేసి మెప్పించారు. ఇటీవల వెబ్ సిరీస్ లో కూడా ఓ డిఫరెంట్ రోల్ పోషించి మెప్పించాడు. ఇందులో కూడా తారకరత్న చాలా డిఫరెంట్ గా ఉంటుంది. తన లుక్ కూడా ఇంతకు ముందుకంటే చాలా స్టైలిష్ గా వుంది. దర్శకుడు తన తొలి సినిమాకి ఓ వైవిధ్యమైన కథను ఎంచుకుని స్క్రీన్ పై ఆవిష్కరించారు. హారర్ థ్రిల్లర్ కి… కాస్త పొలిటికల్ డ్రామను కూడా జోడించడం ఆసక్తి కలిగిస్తుంది. హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లే ట్రైన్ లో ఒక కోచ్ మొత్తం మంటలు అంటుకోవడం… అందులో ఉన్న వాళ్లంతా చనిపోయారనుకుంటే… తిరిగి బతికి రావడం… ఆ ఒక్క బోగికే ఎందుకు మంటలు వ్యాపిస్తాయి? సీఎం తనయుడు సుబ్బు తన మిత్రులతో కలిసి బోగిని అలంకరించుకుని పార్టీ చేసుకుంటూ వుంటే… సడెన్ గా కోచ్ డోర్స్ క్లోజ్ కావడం… ఆ తర్వాత అగ్నిప్రమాదం జరగడం… అసలా అగ్నిప్రమాదం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఆ తర్వాత ఏమైందనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. చివరిదాకా ఊహకందని ట్విస్టులతో సినిమా ఆద్యంతం ఉత్కంఠను రేపుతుంది.

తండ్రి చెప్పిన మాట ప్రకారం నడుచుకునే సుబ్బు పాత్రలో తారకరత్న బాగా నటించారు. మాటలు కూడా చాలా తక్కువగా వుంటాయి. కేవలం హావ భావాలతోనే ఆకట్టుకున్నారు. నాన్న చెప్పిందే చేస్తా నాకేం తెలియదు అన్నట్టు ఉండే సుబ్బు… చివరకు ఎలాంటి డెసిషన్ తీసుకుకుంటారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. టీసీ పాత్రలో అలీ చేసే కామెడీ అందరినీ ఆకట్టుకుంటుంది. బిగ్ బాస్ కాన్సెప్ట్ డైలాగులు బాగా కనెక్ట్ అవుతాయి. దుబాయ్ నుంచి వచ్చే సులేమాన్ పాత్రలో సునీల్ కాసేపు కనిపించి బాగా నవ్విస్తాడు. ఇస్మార్ట్ శంకర్ లోని పాటలకు డ్యాన్స్ చేస్తూ… తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. దొంగల బ్యాచ్ కి లీడర్ వహించే పాత్రలో ప్రిన్స్ బాగా సూట్ అయ్యారు. గబ్బర్ సింగ్ బ్యాచ్, ఫిష్ వెంకట్, రఘు తదితరులు అంతా తమ కామెడీ ట్రాక్ లతో అలరించారు.

ఇండస్ట్రీలో హీరో అవుదామని వచ్చి… చివరకు కొరియోగ్రాఫర్ గా మారి.. ఇప్పుడు దర్శకుడి అవతారం ఎత్తిన దర్శకుడు భరత్ కోమలపాటి… ఈ చిత్రానికి కాస్త వైవిద్యంగా వున్న కథను రాసుకుని… దాన్ని సెల్యులాయిడ్ పై ఓ వైపు భయపెడుతూనే… మరో వైపు వినోదాత్మకంగా ఆవిష్కరించారు. హారర్ థ్రిల్లర్ కి పొలిటికల్ డ్రామాను జోడించి… చాలా ఆసక్తికరంగా సినిమాని తెరకెక్కించారు. మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్… ఇలాంటి హారర్ సినిమాలకు పర్ ఫెక్ట్ యాప్ట్ అయింది. గరుడవేగ అంజి అందించిన సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటింగ్ కూడా చాలా గ్రిప్పింగ్ గా వుంది. నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా… కంటెంట్ ను నమ్ముకుని సినిమా తీశారు. చాలా రిచ్ గా వున్నాయి నిర్మాణ విలువలు. గో అండ్ వాచ్ ఇట్.

మూవీ ప్రమోషన్ రేటింగ్ : 3/5

నువ్వే నా ప్రాణం..మూవీ రివ్యూ

నువ్వే నా ప్రాణం..మూవీ రివ్యూ

కిరణ్‌రాజ్‌, ప్రియాహెగ్డే జంటగా నటించిన చిత్రం నువ్వే నా ప్రాణం. వరుణ్‌ కృష్ణ ఫిల్మ్స్‌ పతాకంపై శేషుదేవ రావ్‌ మలిశెట్టి నిర్మించిన ఈ చిత్రానికి శ్రీకృష్ణ మలిశెట్టి దర్శకత్వం వహించారు. సుమన్, భానుచందర్‌, గిరి, సోనీ చౌదరి ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ చిత్రం టీజర్, ట్రైలర్లతో ఆకట్టుకుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఏమాత్రం ఆకట్టుకుందో లేదో చూద్దాం.

సినిమా కథ: సంజు(కిరణ్ రాజ్) సరదాగా తిరుగుతూ… గైనకాలజిస్టుగా పనిచేసే కిరణ్(ప్రియా హెగ్డే)ని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. అయితే కిరణ్ మాత్రం అతని ప్రేమను అంగీకరించదు. కానీ… సంజు మాత్రం కిరణ్ వెంటపడుతూ… ఆమె ప్రేమను పొందడానికి చాలా రకాలుగా ట్రై చేస్తుంటాడు. అయితే ఓ సందర్భంలో సంజు సాధారణ యువకుడు కాదు… అతను కూడా ఓ బాధ్యతాయుతమైన పొజిషన్లో వున్న వ్యక్తి… పైగా ఎమ్మెల్యే ఆది శేషు(సుమన్) అని తెలుసుకుని… సంజుని ప్రేమించడం ప్రారంభిస్తుంది. అయితే.. కిరణ్ తండ్రి (భాను చందర్) కూడా సంజు తండ్రి ఆది శేషుకు మంచి మిత్రుడు కావడంతో… ఇద్దరికీ పెద్దల సమక్షంలో వివాహం జరుగుతుంది. అయితే పెళ్లయిన తరువాత కిరణ్ పద్ధతిగా చీరలు కట్టుకోవడం సంజుకి అసలు ఇష్టం వుండదు. ఆమెను పొట్టి డ్రస్సుల్లో చూడాలని… పబ్ కు పోయి డిస్కో థెక్ లు వేయాలని బలవంతం చేస్తూ… మందు, సిగరెట్లు తాగుతూ ఉంటాడు. ఉన్నట్టుండి సంజు అలా ఎందుకు మారాడు? వీటన్నింటినీ కిరణ్ ఎలా భరించి సాల్వ్ చేసుకుంది? ఇవి తెలుసుకోవాలి అనుకుంటే సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :
దర్శకుడు
హీరో
హీరోయిన్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
ఎడిటింగ్
సెకండ్ హాఫ్
మైనస్ పాయింట్స్ :

మొదటి భాగం అక్కడ అక్కడ బోరింగ్ సీన్స్

సినిమా కథ… కథనం విశ్లేషణ: కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడిన ప్రేమకథలు చాలానే చూసుంటాం. కానీ… అందులో ఓ బాధ్యతాయుతమైన యువతీ యువకుల మధ్య కలిగే ప్రేమ కథని అందంగా తెరపై సెటిల్డ్ గా ఆవిష్కరించడం అంటే సాహసమే. కానీ.. నువ్వే నా ప్రాణం చిత్రంలో ఇది సాధ్యమైంది. ఓ బాధ్యత గల పోలీస్ అధికారి… పేదరికంతో ఇబ్బందులు పడే గర్భిణీల ఆరోగ్యం పట్ల ఎంతో బాధ్యతగా శ్రద్ధ తీసుకునే ఓ వైద్యురాలు… ఈ ఇద్దరి మధ్య ప్రేమకథని నడిపించి… ప్రేక్షకులను మెప్పించారు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ లో హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమ, పెళ్లితో నడిపించి… సెకెండాఫ్ లో సంప్రదాయంగా మెలిగే భార్యను పాశ్చాత్య పోకడలను అలవాటు చేసుకోవాలని హింసించే భర్త… దాన్నుంచి బయట పడటానికి హీరోయిన్ పడే కష్టాలు, సంజుని మార్చడానికి గిరి, సోనీ చౌదరి పాత్రలు ఎంటర్ చేసి… భార్యభర్తల మధ్య అన్యోన్యత ఎలా ఉండాలి అనే దానికి వీరి జంటను ఉదాహరణ చూపించడం… లాంటి సీన్లు ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటాయి. అలాగే యూత్ కి కావాల్సిన గ్లామర్ కోషంట్ కూడా ఇందులో ఉంది. హీరోయిన్ ప్రియా హెగ్డే అందాలు బాగా ఆకర్షిస్తాయ. చివర్లో వచ్చే ఐటెం సాంగ్ మాస్ ని బాగా ఆకట్టుకుంటుంది. అలాగే పెడదోవ పట్టే యువతకి తల్లిదండ్రులు చేయాల్సిన మార్గనిర్దేశాలను ఇందులో చూపించారు. ఫైనల్ గా నువ్వే నా ప్రాణం… యువతతో పాటు… ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది.
హీరోగా నటించిన కిరణ్ రాజ్… ఇందులో ప్రేమికునిగా… బాధ్యతగల పోలీస్ ఆఫీసర్ గా, మరో వైపు మద్యం, సిగరెట్లకు బానిసై… భార్యను మోడ్రన్ దుస్తుల్లో చూడాలనుకునే శాడిజం వున్న భర్తగా… ఇలా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో కనిపించి మెప్పించారు. పాటలు, ఫైట్లలోనూ తన ఈజ్ ను చూపించారు. హీరోయిన్ గా నటించిన ప్రియా హెగ్డే తన అందలతో పాటు… నటనతోనూ ఆకట్టుకుంటుంది. పాటల్లో తన అంద చందాలతో యూత్ ని బాగా ఆకట్టుకుంటుంది. మరో వైపు సంప్రదాయ దస్తుల్లో పక్కింటి అమ్మాయిగా కనిపించింది. ఎమ్మెల్యే ఆది శేషు పాత్రలో సుమన్, హీరోయిన్ తండ్రి పాత్రలో భాను చందర్ నటించి మెప్పించారు. అలాగే పైకి ఎంతో అన్యోన్యతగా కనిపిస్తూ… లోపల బాగా పోట్లాడుకునే జంటగా కమెడియన్ గిరి, యాంకర్ సోనీ చౌదరిల పెయిర్ బాగా నవ్విస్తుంది.

దర్శకుడు శ్రీకృష్ణ మలిశెట్టి సివిల్ ఇంజినీర్ అయినా… దర్శకత్వ శాఖలో ఎంతో అనుభవం వున్న వ్యక్తిగా చిత్రాన్ని ఎంతో అందంగా వెండితెరపై ఆవిష్కరించారు. యూత్ ని, ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ… ఎక్కడా ఒల్గారిటీ లేకుండా సినిమాని తెరకెక్కించి సక్సెస్ అయ్యారు. హీరోని మొదట ఓ సాధారణ యువకుని గా చూపించి… ఆ తరువాత అతను సామాన్యుడేమీ కాదు… అతనూ సొసైటీలో పలుకుబడి వున్న కుటుంబం నుంచి వచ్చిన వాడు… పైగా ఎంతో బాధ్యతా యుతమైన వృత్తిలో మెలిగే యువకుడు అని చూపించడం యువతకు ఇన్సిపిరేషన్. సంగీతం బాగుంది. మాస్ ను మెప్పించే పాటలున్నాయి. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటింగ్ సెకెండాఫ్ లో ఇంకాస్త క్రిస్పీగా వుండాల్సింది. నిర్మాత శేషుదేవ రావ్‌ మలిశెట్టి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను తెరకెక్కించారు. గో అండ్ వాచ్ ఇట్.

మూవీ ప్రమోషన్ రేటింగ్: 3/5

లక్కీ లక్ష్మణ్ మూవీ రివ్యూ

లక్కీ లక్ష్మణ్ మూవీ రివ్యూ

తెలుగులో బాగా పాపులర్ అయిన రియాలిటీ షో… బిగ్ బాస్ ద్వారా ప్రేక్ష‌కుల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న సోహైల్… సామాజిక సేవా కార్య‌క్ర‌మాల ద్వారా కూడా ప్ర‌జ‌ల‌కు మ‌రింత‌గా ద‌గ్గ‌రయ్యారు. ఈయ‌న హీరోగా నాలుగు సినిమాలు చేస్తున్నారు. అందులో ముందుగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సినిమా ‘లక్కీ లక్ష్మణ్’. బిగ్ బాస్ కంటే ముందు సీరియల్స్‌లో న‌టించి మెప్పించిన సోహైల్‌కు యాక్టింగ్ కొత్తేమీ కాదు. అయితే సిల్వ‌ర్ స్క్రీన్ ఎక్స్‌పీరియెన్స్ మాత్రం కొత్త‌దే. మ‌రి ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్‌గా సోహైల్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నారా? నిజంగానే సోహైల్ ల‌క్కీయేనా? అస‌లు ఈ సినిమా ద్వారా త‌నేం చెప్పాల‌నుకున్నారు? అనే విష‌యాల‌ను తెలుసుకోవాలంటే ముందు సినిమా చూడాల్సిందే…!!!

కథ: ల‌క్ష్మ‌ణ్ అలియాస్ ల‌క్కీ (సోహైల్‌) తండ్రి వెంక‌టేశ్వ‌ర‌రావు(దేవీ ప్ర‌సాద్ దిగువ మ‌ధ్య త‌ర‌గ‌తికి చెందిన వ్య‌క్తి. చిన్న‌ప్ప‌టి నుంచి ల‌క్కీ త‌ల్లిదండ్రుల‌ను ఏమ‌డిగినా త‌మ వ‌ద్ద డ‌బ్బులేదంటుంటారు. దాంతో పేరెంట్స్‌పై ల‌క్కీకి తెలియ‌ని ఓ కోపం పెరిగిపోతుంది. ఇంజ‌నీరింగ్‌లో చేరిన త‌ర్వాత ల‌క్కీకి శ్రియ (మోక్ష‌)తో ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. ఆ ప‌రిచ‌యం ప్రేమ‌గా మారుతుంది. ల‌క్కీ పేద‌రికాన్ని అర్థం చేసుకున్న శ్రియ అత‌నికి స‌పోర్ట్ చేస్తుంది. ల్యాప్ టాప్‌, బైక్ వంటి వాటిని కొనిస్తుంది. అదే స‌మ‌యంలో మ‌రో అమ్మాయి ల‌క్కీకి ద‌గ్గ‌ర‌వ్వాల‌ని చూస్తుంది. దీని కార‌ణంగా ల‌క్కీ, శ్రియ విడిపోతారు. అదే స‌మ‌యంలో ల‌క్కీ త‌ల్లిదండ్రులపై ఉన్న కోపంతో వారి నుంచి దూరంగా వ‌చ్చేస్తాడు. ల‌క్కీ మ్యారేజ్ బ్యూరోని స్టార్ట్ చేసిన ల‌క్కీ డ‌బ్బే స‌ర్వ‌స్వం అనుకుంటుంటాడు. అలాంటి ల‌క్కీకి ఎదురైన అనుభ‌వాలేంటి? ధ‌న‌వంతురాలైన శ్రియ ఎందుకు డ‌బ్బు లేని అమ్మాయిగా మారుతుంది.. చివ‌ర‌కు ల‌క్కీకి త‌న తండ్రి గురించి తెలిసిన నిజం ఏంటి? ల‌క్కీ త‌న ప్రేమ‌ను గెలుచుకుంటాడా.. డ‌బ్బు వెనుకే ప‌రిగెడుతాడా? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

కథ.. కథనం విశ్లేషణ: ఇద్ద‌రు వ్య‌క్తులు సంతోషంగా ఉండాలంటే వారి మ‌ధ్య డ‌బ్బు కంటే ప్ర‌ధాన‌మైన‌ది భావ సారూప్య‌త ముఖ్యం. ఆ విష‌యాన్ని చెప్ప‌టానికే ద‌ర్శ‌కుడు అభి చేసిన ప్ర‌య‌త్న‌మే ‘ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్’ చిత్రం. ఫ్యామిలీతో క‌లిసి చూసే ప్రేమ క‌థా చిత్రంగా అభి క‌థ‌ను త‌యారు చేసుకున్నారు. అయితే కేవ‌లం ప్రేమ క‌థ‌గా సినిమాను తెర‌కెక్కించాల‌నుకోలేదు. అలాగే ల‌వ్ స్టోరి క‌దా.. రెండు, మూడు లిప్ లాక్స్ వంటి స‌న్నివేశాల‌ను పెట్టాల‌ని కూడా అనుకోలేదు. క్లీన్‌గా తెర‌కెక్కించాల‌నుకోవ‌ట‌మే ఈ సినిమాకు ప్ల‌స్. దీనికి తోడు తండ్రి ఎమోష‌న్‌ను అండ‌ర్ కరెంట్‌గా ర‌న్ చేస్తూ వ‌చ్చారు. సినిమా మెయిన్ ట‌ర్నింగ్ పాయింట్‌కి అదే బేస్ అయ్యింది. ఆడియెన్స్ కూడా ఆ పాయింట్‌కే ఎక్కువ‌గా క‌నెక్ట్ అయ్యారు.

సోహైల్ స్క్రీన్ ప్రెజెన్స్ బావుంది. త‌న‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. మాస్ ఇమేజ్ కావాలి.. విల‌న్లను కొడితే ఎగిరెగిరి ప‌డాలి అనే స్టైల్లో కాకుండా కూల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌లో క‌థానుగుణంగా ఉండే త‌న పాత్ర‌లో సోహైల్ ఒదిగిపోయారు. మోక్ష కూడా త‌న పాత్ర ప‌రిధి మేర‌కు చ‌క్క‌గా న‌టించింది. దేవీ ప్ర‌సాద్‌, కాదంబ‌రి కిర‌ణ్ కుమార్ త‌దిత‌రులు అంద‌రూ చ‌క్క‌గా న‌టించారు. దిగువ మధ్య తరగతి తండ్రి పాత్రలో ఆయన నటన బావుంది. ఇక కాందబరి కిరణ్ కుమార్ కాసేపే కనిపించినప్పటికీ ఎమోషనల్ సీన్స్ లో సూపర్‌గా చేశారు. సోహైల్, కాదంబరి సన్నివేశానికైతే ఆడియెన్స్ క్లాప్స్ కొడతారంటే .. సీన్ ఎంత బాగా పండిందో అర్థం చేసుకోవచ్చు.
ద‌ర్శకుడు అభి అండ‌ర్ క‌రెంట్‌గా చెప్పాల‌నుకున్న విష‌యం ఎమోష‌న‌ల్‌గా ఉంది. దాన్ని ప్రెజంట్ చేసిన తీరు బావుంది. హీరో, హీరోయిన్ కాలేజ్ స్టోరి, దాని చుట్టూ న‌డిచే ల‌వ్ ట్రాక్ అన్నీ బాగున్నాయి. ఫస్టాఫ్ మొదలుకొని… సెకండాఫ్ ప్రధాన బలంగా నిలిచాయి. సినిమాలో కాస్త కామెడీ ట్రాక్‌ కూడా బాగుంది. సెకండాఫ్‌లో ప్రీ క్లైమాక్స్ నుంచి క‌థ వేగంగా కదులుతూ… దానికంటే డిఫ‌రెంట్‌గా, ఎమోష‌న‌ల్‌గా వెళుతుంది. అనూప్ అందించిన నేప‌థ్య సంగీతం బావుంది. ఓ మేరీ జాన్ సాంగ్ బావుంది. అండ్రూ సినిమాటోగ్ర‌ఫీ బావుంది. త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల‌పై చూపించే ప్రేమ‌, కోపం వెనుక బ‌ల‌మైన ప‌రిస్థితులుంటాయ‌నే విష‌యాన్ని చ‌క్క‌గా చూపించారు. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. ఖర్చుకు వెనుకాడకుండా సినిమాని చాలా క్వాలిటీ గా నిర్మించారు. టోటల్ గా ఫ్యామిలీ ఆడియన్స్ ని లక్కీ లక్ష్మణ్ అలరిస్తాడు. గో అండ్ వాచ్ ఇట్..!

రేటింగ్: 3/5

యూత్ ఆడియెన్స్ కు పండగే – రాజయోగం రివ్యూ

యూత్ ఆడియెన్స్ కు పండగే – రాజయోగం రివ్యూ

నటీనటులు – సాయి రోనక్, అంకిత సాహా, బిస్మి నాస్, అజయ్ ఘోష్, ప్రవీణ్, గిరి, సిజ్జు భద్రం మధునందన్ తదితరులు

టెక్నికల్ టీమ్ – డైలాగ్స్ – చింతపల్లి రమణ, సినిమాటోగ్రఫీ – విజయ్ సి కుమార్, సంగీతం – అరుణ్ మురళీధరన్,  సహ నిర్మాతలు – డాక్టర్ శ్యామ్ లోహియా, నందకిషోర్ దారక్, నిర్మాత – మణి లక్ష్మణ్ రావు, స్టోరి డైరెక్షన్ – రామ్ గణపతి.

ప్రస్తుతం ప్రేక్షకులు మంచి హాలీడే మూడ్ లో ఉన్నారు. ఇయర్ ఎండ్ కాబట్టి న్యూ ఇయర్ కు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేందుకు ఎదురుచూస్తున్నారు. ఈ టైమ్ లో ఎంజాయ్ చేసేందుకు ఓ రొమాంటిక్ ఎంటర్ టైనర్ సినిమా కూడా ఉంటే ఆ జోష్ మరింత పెరిగినట్లే. ఈ ఉత్సాహాన్ని అందించేందు దర్శకుడు రామ్ గణపతి ఓ సక్సెస్ ఫుల్ ప్రయత్నం చేశాడు. అదే రాజయోగం. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథేంటంటే :

ఓ మధ్య తరగతి కుర్రాడు రిషి (సాయి రోనక్). డబ్బు లేకున్నా కోటీశ్వరుడు కావాలనే కలల్లో తేలుతుంటాడు. డబ్బున్న అమ్మాయిని ప్రేమిస్తే ఈజీగా ధనవంతుడు అవ్వొచ్చని ఊహిస్తుంటాడు. ఓ సందర్భంలో తన ఓనర్ ప్లేస్ లో స్టార్ హోటల్ కు వెళ్తాడు రిషి. అక్కడే ఓ నాలుగు రోజులు ఓనర్ ప్లేస్ లో గడిపే అవకాశం అతనికి దొరుకుతుంది. అదే హోటల్ కు వచ్చిన శ్రీ (అంకిత సాహా ) రిషికి పరిచయమవుతుంది. తనను కోటీశ్వరుడిని చేసే డ్రీమ్ గర్ల్ ఈమేనని అనుకున్న రిషి శ్రీకిి దగ్గరవుతాడు. ఇలా ప్రేమించుకున్న రిషి, శ్రీ ఎందుకు విడిపోవాల్సి వచ్చింది. మరోవైపు 10 వేల కోట్ల రూపాయల వజ్రాన్ని దక్కించుకునే కథ సాగుతుంటుంది. ఇందులో రాధా (అజయ్ ఘోష్) పాత్ర ఏంటి. రిషికి వజ్రాల గురించి ఐశ్వర్య (బిస్మి నాస్) ఏం చెప్పింది. ఆ విలువైన వజ్రాన్ని హీరో దక్కించుకునే ప్రయత్నంలో కథ ఎలాంటి మలుపులు తిరిగింది అనేది తెరపైనే చూడాలి.

ఫ్లస్ పాయింట్స్ :
కావాల్సినంత ఎంటర్ టైన్ మెంట్
డబ్బు కంటే లవ్ గొప్పదనే కాన్సెప్ట్
రొమాంటిక్ ఎలిమెంట్స్

సినిమా ఎలా ఉందంటే : సినిమా ద్వారా వినోదాన్ని అందించే సినిమాలు సక్సెస్ అవుతాయి. అయితే అందులో కాస్త మంచి విషయాన్ని చెబితే ఆ సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలా ఫన్, డ్రామా, రొమాన్స్ వంటి అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటే ఓ గుడ్ పాయింట్ తో ఆకట్టుకుంది రాజయోగం సినిమా. దీనికి ఫస్ట్ క్రెడిట్ దర్శకుడు రామ్ గణపతికే ఇవ్వాలి. అతను సినిమాను తెరకెక్కించిన తీరు సూపర్బ్. దురాశ గల ఓ జంట మధ్య సాగే నడిపిన స్క్రీన్ ప్లే నవ్విస్తుంది. రిషి పాత్రలో నటించిన హీరో సాయి రోనక్ . డ్యాన్సులు ఫైట్స్, రొమాన్స్, లిప్ లాక్ సీన్స్, కామెడీ ఇలా అన్ని యాంగిల్స్ లో చాలా బాగా నటించి మెప్పించాడు. హీరోయిన్ అంకిత సాహా బాంబే నుంచి వచ్చిన అమ్మాయి అయినా లిప్ లాక్, రొమాన్స్ చేసే విషయంలో ఏ మాత్రం సిగ్గుపడకుండా తన అందాన్ని, అభినయాన్ని ప్రదర్శించి అందరినీ కవ్వించింది అని చెప్పవచ్చు . ఈ సినిమాకు ప్రతి ఒక్కరూ పర్పెక్ట్ కాస్టింగ్ అయ్యారు. సంగతం బాగుంది. అన్ని పాటలు ఆకట్టుకుంటాయి. ఒక రొమాంటిక్ సాంగ్ మాత్రం యూత్ కు అంకితం చేయొచ్చు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, ప్రొడక్షన్ వంటి సాంకేతిక అంశాల్లో ఈ సినిమా పర్పెక్ట్ గా రూపొందింది. ఈ ఇయర్ ఎండ్ ఫెస్టివల్ మూడ్ లో రాజయోగం థియేటర్ ఎక్సీపియరెన్స్ ఇస్తుంది.

మూవీ ప్రొమోషన్స్ 3/5

శాసనసభ మూవీ రివ్యూ

శాసనసభ మూవీ రివ్యూ

పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన చిత్రం శాసనసభ. ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్ జంటగా నటించిన తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రానికి నిర్మాతలు తులసీరామ్ సాప్పని, సణుగం సాప్పని. స్కాలో ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించారు. వేణు మడికంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి రచయిత గా రాఘవేంద్రరెడ్డి. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం అంచనాల మధ్య రిలీజ్ అయింది

సినిమా కథ: శ్యామల భరత్(సోనియా అగర్వాల్) ప్రతిపక్ష నాయకురాలు. రామమోహన్ నాయుడు(అనీష్ కురువిల్లా) అధికార పార్టీకి చెందిన నాయకుడు. వీరిద్దరూ ఒకరిపై ఒకరు పై చేయి సాధించడానికి ఒకరి ఎమ్మెల్యేలను మరొకరు కిడ్నాప్ చేసి అధికారం చేపట్టాలని తమ తమ అనుచరులతో కలిసి ప్లాన్స్ వేస్తారు. అయితే వీరి ప్లాన్స్ ను తిరగబడేలా చేసి ఇరు పార్టీల ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేసి అడవికి తరలిస్తాడు సూర్య(ఇంద్రసేన). ఇలా అడవికి తీసుకెళ్లిన ఎమ్మెల్యేలను సూర్య ఏమి చేశాడు? అసలు సూర్య ఎవరు? ఎందుకు ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేశాడు? అతని లక్ష్యం ఏమిటి అనేది తెలియాలంటే శాసనసభ సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :
సినిమా కథ
సినిమా డైరెక్షన్
మ్యూజిక్
రి రికార్డింగ్

మైనస్ పాయింట్స్ :

ఎడిటింగ్

కథ.. కథనం విశ్లేషణ:

పొలిటికల్ డ్రామా, పొలిటికల్ థ్రిల్లర్ సినిమాలను ఇంతకు ముందు చాలా వచ్చాయి. అయితే అవన్నీ… ఒకరిపై ఒకరు ఎత్తులు వేసుకుని… చివరకు పై చేయి సాధించడం అనే కాన్సెప్ట్ తో తెరకెక్కినాయి. అందులో పొలిటికల్ డ్రామా మాత్రమే వుంటుంది. అయితే శాసనసభ ఔన్నత్యం ఏమిటో చెప్పడానికి రచయిత రాఘవేంద్ర రెడ్డి రాసుకున్న ఈ చిత్రం కథ… కథనాలు నేటి పొలిటీషియన్స్ ఆలోచనల్ని మార్చే విధంగా వుంది. శాసనసభ అనగానే మనకి గుర్తొచ్చేది… ప్రతి పక్షాల ఆరోపణలు… అధికాపక్షాల కౌంటర్లు. ఈ మధ్య శాసనసభలో మరీ హద్దులు దాటిపోయి… పర్సనల్ అటాకింగ్ గా మారిపోయాయి శాసనసభ సమావేశాలు. ఒకరినొకరు వ్యక్తిగత ధూషణలు చేసుకుంటూ… విలువైన సమయాన్ని కాస్త తిట్ల పురాణాలకే పరిమితం అయ్యేలా సాగుతున్నాయి. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి వేదిక వుండాల్సిన శాసనసభ సమావేశాలు… ఆరోపణలు… ప్రత్యారోపణలతో ప్రజల ధనాన్ని వేస్ట్ చేసేస్తున్నారనే ఆరపణలు వున్నాయి. ప్రజాసమస్యల పరిష్కారానికి వేదికగా వుండాల్సిన దేవాలయం లాంటి శాసనసభని బూతుపురాణ కేంద్రాలుగా మార్చేశారు. అందుకే అలాంటి శాసనసభని కేంద్రంగా చేసుకుని రాసుకున్న కథ, కథనాలు ఇంట్రెస్టింగ్ గా వున్నాయి. ముఖ్యంగా ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో రాజకీయ నాయకులు చేసే వాగ్ధానాలు… వాటిపై ప్రజలు నమ్మకం పెట్టుకుని గెలిపిస్తే… గెలిచిన తరువాత వాళ్లు ఎలా విస్మరిస్తారు? అలాంటి వారికి సూర్య ఎలాంటి కర్తవ్య బోధన చేశాడు అనే అంశాలు… నేటి రాజయకీయ నాయకులను ఆలోచింపజేస్తాయి. నారాయణస్వామి(రాజేంద్రప్రసాద్)లాంటి నీతి నిజాయతీ వున్న ఎమ్మెల్యేను ఆదర్శంగా తీసుకుని… ప్రజాసేవలో ఎలా నిమగ్నమవ్వాలనే దానిని… అలాంటి వారు అసెంబ్లీలో వుంటే.. ఎలా రాణించగలుగుతారు? వారికి ఎదురయ్యే సవాళ్లు లాంటి సున్నిత అంశాలను కూడా బాగా చూపించారు. అలాగే యువత ఎన్నికల్లో పాల్గొంటే… వారికి పొలిటీషియన్స్ నుంచి ఎలాంటి త్రెట్ వుంటుందనేది కూడా చూపించారు. ఓవరాల్ గా శాసనసభ… ఓ మంచి మెసేజ్ ఇస్తుంది.
హీరో ఇంద్రసేన స్టూడెంట్ లీడర్ గా… ఆ తరువాత పొలిటీషియన్స్ ఎదిరించే సూర్య పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. ఎమ్మెల్యేలకు కర్తవ్య బోధన చేసే విద్యార్థి నాయకునిగా మెప్పించాడు. యాక్షన్ సీన్స్ లో ఆకట్టుకుంటాడు. రాజకీయ నాయకురాలి పాత్రలో 7జీ ఫేం సోనియా అగర్వాల్ కనిపించి ఆకట్టుకుంటుంది. చాలా కాలం తరువాత ఆమె ఇందులో నటించడం విశేషం. నిజాయతీ గల పొలిటీషియన్ పాత్రలో నటకిరీటి రాజేంద్రప్రసాద్ మెప్పిస్తాడు. అతని పాత్ర ద్వారా ఓ మంచి మెసేజ్ ఇవ్వడం బాగుంది. హెబ్బా పటేల్ తో చేసిన ఐటెం సాంగ్ యూత్ ని ఆకట్టుకుంటుంది. మిగతా పాత్రలన్నీ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

ప్రముఖ జర్నలిస్ట్, పీఆర్వో రాఘవేంద్రరెడ్డి రాసుకున్న కథ, కథనాలను దర్శకుడు చక్కగా తెరకెక్కించాడు. ఎక్కడా బోరింగ్ లేకుండా కథనాన్ని వేగంగా నడిపించడంలో సక్సెస్ అయ్యారు. ఎడిటింగ్ కూడా చాలా క్రిస్పీగా వుంది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు.నిర్మాణ విలువలు చాలా క్వాలిటీగా వున్నాయి. ఈ వారం తప్పక చూడాల్సిన చిత్రం.
మూవీ ప్రమోషన్ : 3/5

నేనెవరు తెలుగు మూవీ రివ్యూ

నేనెవరు తెలుగు మూవీ రివ్యూ

కౌశల్ క్రియేషన్స్ పతాకంపై భీమినేని శివప్రసాద్-తన్నీరు రాంబాబు సంయుక్తంగా నిర్మించిన చిత్రం “నేనెవరు”. నిర్ణయ్ పల్నాటి దర్శకత్వంలో తెరకెక్కింది. లవ్… సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిత్రానికి పూనమ్ చంద్-కుమావత్-కిరణ్ కుమార్ మోటూరి సహ నిర్మాతలు. ఇందులో కోలా బాలకృష్ణ హీరోగా నటించారు. తనిష్క్ రాజన్, గీత్ షా, బాహుబలి ప్రభాకర్, రాజా రవీంద్ర, దిల్ రమేష్, డి.ఎస్.రావు తాగుబోతు రమేష్, వేణు, సుదర్శన్ రెడ్డి, నీరజ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ వారం మంచి బజ్ రిలీజ్ అయింది .

సినిమా కథ: క్రిష్ (కోలా బాలకృష్ణ) , చిత్ర (గీత్ షా) ఇద్దరు ప్రేమించుకుంటారు. అయితే చిన్న విషయం దగ్గర ఇద్దరు గొడవ పడి విడిపోతారు. చిత్రాని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన క్రిష్… వున్నట్టుండి చిత్రకి దూరం కావడంతో బాగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు. అయితే అదే సమయంలో తన మేనత్త, మేనత్త కూతురు (తనిష్క్ రాజన్)… జీకే (బాహుబలి ప్రభాకర్), తన మేనత్త అనుచరుడు నాయుడు వరుసగా హత్యలకు గురవుతారు. అయితే మరోవైపు క్రిష్ మాత్రం తన ప్రేయసిని తలచుకుంటూ… తాగుడుకు బానిసై అందరితో గొడవ పడుతూ… కనిపించిన వారికి అంతా తన లవ్ స్టోరీని చెబుతూ తిరగేస్తూ వుంటాడు. మరి తన జీవితం నుంచి వెళ్లిపోయిన చిత్ర మళ్ళీ వచ్చిందా? ఆ వరుస హత్యలకు కారణం ఎవరు అనేది తెలియాలంటే మీరు తప్పక సినిమా చూడాల్సిందే.

సినిమా కథ. కథనం విశ్లేషణ: ఇలాంటి కథలని ఎన్నికోణాల్లో ఆవిష్కరించినా కొత్తగానే ఉంటుంది. ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేసే గ్రిప్పింగ్ కథ… కథనాలతో లవ్, సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ మూవీని దర్శకుడు నిర్ణయ్ పల్నాటి తెరకెక్కించాడు. ఫస్ట్ హాఫ్ లో హీరోని భగ్న ప్రేమికడిగా, తాగుబోతుగా చూపించి… ఆ తరువాత… మర్డర్ మిస్టరీని ఛేదించిన విధానం ప్రేక్షకుల్ని థ్రిల్ కి గురి చేస్తుంది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకూ క్రైం ఎలిమెంట్స్ తో ఆడియెన్స్ ను కట్టి పడేస్తుంది. దర్శకుడు రోటీన్ జోనర్స్ ని టచ్ చేయకుండా… ఓ డిఫరెంట్ జోనర్లో ఈ మూవీని తెరకెక్కించడంలో విజయం సాధించాడు చెప్పవచ్చు

హీరోగా నటించిన కోలా బాలకృష్ణ భగ్న ప్రేమకుడిగా… రివేంజ్ డ్రామా లో . మాస్ ను మెప్పించే పాత్రలో విజయం సాధించారు. అలానే అతనికి జంటగా ప్రేయసి పాత్రలో గీత్ షా… చక్కగా వొదిగిపోయింది. హీరోను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే యువతిగా… కాస్తా సైకో ఇజం పాత్రలో ఆకట్టుకుంటుంది. అలాగే హీరో మరదలిగా తనిష్క్ రాజన్ మెప్పించింది. ఆమె అమ్మగా నటించిన నటి కూడా బాగానే చేసింది. పోలీస్ పాత్రలో నటించిన సాక్షి చౌదరి కూడా.. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా మెప్పించింది. బాహుబలి ప్రభాకర్… జి.కె.పాత్రలో విలన్ గా మెప్పించారు. హీరో స్నేహితునిగా కమెడీయన్ సుదర్శన్ కూడా తన పాత్ర పరిధి మేరకు నటించి ఆకట్టుకున్నాడు. మిగతా పాత్రలు అన్ని తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

ప్లస్ పాయింట్స్ :

డైరెక్షన్
ఎడిటింగ్
మ్యూజిక్
హీరో
హీరోయిన్
సినిమాటోగ్రఫిక్

మైనస్ పాయింట్స్ :

రొటీన్ సినిమాలకి బిన్నంగా
కామెడీ లేకపోవడం

దర్శకుడు గా కథ… కథనాలు గ్రిప్పింగ్ గా… ఎంగేజింగ్ గా వున్నాయి. ఆర్.జి.సారథి అందించిన సంగీతం ఆకటటుకుంటుంది. ముఖ్యంగ క్రైం థ్రిల్లర్స్ కి కావలసిన నేపథ్య సంగీతం బాగా కుదిరింది. సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ బాగున్నాయి.
చివరగా : ఈ వారం క్రైమ్ థ్రిల్లర్లను ఇష్టపడే వారికి ఒక మంచి సినిమా , తప్పక చూడండి .

మూవీ ప్రమోషన్ రివ్యూ 3/5