ఆది సాయికుమార్, మిషా నారంగ్ జంటగా నటించిన చిత్రం ‘సిఎస్ఐ సనాతన్’. సస్పెన్షన్ క్రైం థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో నందిని రాయ్, తారక్ పొన్నప్ప, మధు సూదన్ రావు, ఆలీ రాజా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకుల్ని ఏమాత్రం థ్రిల్ కు గురి చేసిందో చూద్దాం పదండి.
కథ: విసి ఫైనాన్స్ కంపెనీ సీయీవో విక్రమ్ చక్రవర్తి(తారక్ పొన్నప్ప) ఓ రోజు రాత్రి తన ఆఫీసులోనే దారుణ హత్యకు గురవుతాడు. అతనిని ఎవరు చంపారు? ఎందుకు చంపారు అనే దాన్ని ఇన్వెస్టిగేసన్ చేయడానికి క్రిమినాలజీలో ఎక్స్ పర్ట్ అయిన సనాతన్ సహాయం తీసుకుంటుంది పోలీసు డిపార్ట్ మెంట్. మరి విక్రమ్ చక్రవర్తి దారుణ హత్య వెనుక ఎవరున్నారు? ఎందుకు అతన్ని చంపారనేదాన్ని సనాతన్ ఏ విధంగా ఛేదించారనేదే మిగతా కథ.
కథ… కథనం విశ్లేషణ: వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు ఆది సాయికుమార్. ఇటీవలే ‘పులి మేక’ వెబ్ సిరీస్ తో మంచి అప్లాజ్ కూడా సంపాధించుకున్నాడు ఆది సాయికుమార్. ఇప్పుడు ‘సిఎస్ఐ సనాతన్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నటుడుగా మాత్రం ప్రతి సినిమా సినిమాకి చాలా బెటర్ అవుతున్నాడని చెప్పాలి. వైవిధ్యమైన పాత్రలు చేస్తూ… తనపని తాను చేసుకుంటూ వెళుతున్నారు ఆది సాయికుమార్. తాజాగా నటించిన సిఎస్ఐ సనాతన్ లో ఓ క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా బాగా సీరియస్ ఉన్న పాత్రలో నటించారు. ఇలాంటి కథలు ఇంతకు ముందు చాలా చూసుంటాం కానీ… కేవలం క్రైమ్ జరిగిన సీన్ ను బేస్ చేసుకుని… హత్యోదంతాన్ని ఛేదించడానికి రెండు గంటల పాటు కథనాన్ని నడిపించడం అంటే మాటలు కాదు. దాన్ని ఎంతో ఎంగేజింగ్ గా దర్శకుడు, హీరో ఆది సాయికుమార్ ముందుకు తీసుకెళ్లారు. ప్రథమార్థం మొత్తం… సీన్ లో లభ్యమైన, అందుబాటులో ఉన్న ఒక్కొక్క క్లూస్ ను విడదీసుకుంటూ వెళ్లి… ఇంటర్వెల్ తర్వాత అసలు కథను రివీల్ చేయడం ప్రేక్షకుల్ని ఎంతో థ్రిల్ కు గురిచేస్తుంది. ముఖ్యంగా విక్రమ్ చక్రవర్తి ఫ్లాష్ బ్యాక్ స్టోరీ నుంచి సినిమా గ్రాఫ్ అమాంతం పెరిగిపోతుంది. ఓ వరాల్ గా సిఎస్ఐ సనాతన్… మంచి ఎంగేజింగ్ థ్రిల్లర్.
ఆది సాయికుమార్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా సీరియస్ మోడ్ లో బాగా నటించారు. అతని ప్రేయసి పాత్రలో హీరోయిన్ కూడా తన పాత్రకు న్యాయం చేసింది. అలాగే నందిని రాయ్… ఎప్పటిలాగే ఆల్ట్రామెడ్రన్ గాళ్ గా దివ్య పాత్రలో మెప్పించింది. ఫైనాన్స్ కార్పొరేషన్ సీయీవో పాత్రలో కన్నడ నటుడు, కేజీఎఫ్ పేం తారక్ పొన్నప్ప నటన హైలైట్. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో అతని పాత్ర బాగా ఆకట్టుకుంటుంది. పొలిటికల్ లీడర్ పాత్రలో నటుడు మధుసూదన రావు ఆకట్టుకున్నాడు. ఆలీ రెజా… రుద్ర పాత్రలో హీరో స్నేహితుడిగా పర్వాలేదు అనిపిస్తాడు. మిగతా పాత్రలన్నీ తమ పరిధిమేరకు నటించి మెప్పించారు.
దర్శకుడు శివశంకర్ దేవ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విధానం చాలా ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ గా మెప్పించింది. నేపథ్య సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్ బాగుంది. సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. నిర్మాత అజయ్ శ్రీనివాస్ ఎక్కడా రాజీ పడకుండా సినిమాని చాలా క్వాలిటీగా నిర్మించారు. గో అండ్ వాచ్ ఇట్.
రేటింగ్: 3