9010892345 Whatsup moviepromotion.pro@gmail.com
Select Page

సమ్మరైనా… వింటరైనా… ఐస్ క్రీమ్ ప్రియులకు కాలంతో పనిలేదు. సరదాగా టైం దొరికితే… ఐస్ క్రీమ్ రుచులు చూడాల్సిందే. అందులోనూ యూనిక్ రుచులు అందించే అవుట్ లెట్స్ ఎక్కడున్నా… ఐస్ క్రీమ్ ప్రియులు ఇట్టే వాలిపోతారు. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి మెట్రోనగరాల్లో… ఐస్ క్రీమ్ ప్రియులకు కొదువే ఉండదు. అలాంటి వారికోసమే… భిన్న రుచులు అందించేందుకు నిర్వాహకులు ఎప్పుడూ ముందుంటారు. అలాంటి కోవకు చెందిన బ్రాండే… డుమాండ్ కాఫీ మీట్స్ ఐస్ క్రీమ్ స్టోర్ వారు. ఇప్పుడు ఇది నగర శివారులోని కొంపల్లిలో అందుబాటులోకి వచ్చింది. ఇది ఇప్పటికే తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో సుమారు 37 అవుట్ లెట్స్ కలిగి ఉంది. కొంపల్లిలో ఏర్పాటు చేసిన అవుట్ లెట్ ను డీజే టిల్లు ఫేం నేహాశెట్టి ప్రారంభించి సందడి చేశారు. ఈ సందర్భంగా నేహా శెట్టి మాట్లాడుతూ… నేను చాలా కాలంగా ఈ బ్రాండ్ గురించి వింటున్నా… కానీ కుదరలేదు. ఇందులో ఐస్ క్రీమ్స్ ని ఒకసారైనా తినాలని ప్రయత్నించా. కానీ కుదరలేదు. ఇన్నాళ్లకు కుదిరింది. వైట్ చాక్లెట్ బ్లాండీ ఫ్లేవర్ నాకు చాలా ఇష్టం. నేను ఈ అవుట్ లెట్ లో ఐస్ క్రీమ్ ల రుచి చూడటానికి చాలా ఇష్టపడతాను అన్నారు. త్వరలో ‘బెదురులంక’ సినిమాతో మీ ముందుకు వస్తానని చెప్పారు ఈ ముద్దుగుమ్మ. ఈ సందర్భంగా ‘డుమాంట్ స్టోర్‌ ఫౌండర్’ వివేక్, ఫ్రాంచైజీ యజమాని అభిషేక్ దేవ మాట్లాడుతూ… డుమాంట్ అంటే రుచి, తాజాదనం, వినోదం. 50 కంటే ఎక్కువ రుచులు, అత్యంత నాణ్యత గల పదార్థాలతో తయారు చేస్తారు. అత్యుత్తమ ఐస్‌ క్రీమ్, కాఫీ (సరికొత్త జోడింపు)ని ఆస్వాధించడానికి ఐస్ క్రీమ్ ప్రియులకు ఇది సరైన స్పాట్ అని అన్నారు. ప్రత్యేక రుచులు కోరుకునే వారికీ ఇది సరికొత్త వేదికగా నిలుస్తుందని అన్నారు.