9010892345 Whatsup moviepromotion.pro@gmail.com
Select Page

1995లో తపస్సు అనే సినిమాలో నటించిన ప్రముఖ దర్శకుడు భరత్ పారేపల్లి మళ్లీ 27 సంవత్సరాల తరువాత ప్రముఖ పాత్రలో ఒక రైతుగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో ది డ్రీమ్స్ కంపెనీ బ్యానర్ పై శ్రీమతి పావని మొక్కరాల సమర్పణలో నాగలి అనే సినిమా తెరకెక్కించారు. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సందర్భంగా దర్శకుడు భరత్ పారేపల్లి మాట్లాడుతూ….“ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో నూతన నటీనటులతో చిత్రీకరణ జరిపాము. నూతన కథానాయకుడు సుదీప్ మొక్కరాల నిడదవోలు, కథానాయకి అనుస్మతి సర్కార్ ముంబాయి, హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో నాలుగు పాటలు ఎంఎల్ రాజా సంగీత సమర్పణలో జరిగాయి. రైతుల ఆత్మహత్యలు… వాళ్ళ కథలు , వెతలు కలయబోసిన 1857, 58ల మధ్య జరిగిన సిపాయిల తిరుగుబాటును తలపించేలా ఇప్పుడు రైతుల తిరుగుబాటు ముఖ్య నేపథ్యంతో ఈ సినిమా చేసాము. ఇందులో ఛాలెంజింగ్ పాత్రలో నటిస్తూ నిర్మించాను. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో నెల రోజులు నిర్వి విరామంగా షూటింగ్ పూర్తిచేసుకుని, ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. జనవరిలో ఆడియో విడుదల చేసి ఫిబ్రవరిలో సినిమా రిలీజ్ చేయడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
భరత్ పారేపల్లి, సత్య ప్రసాద్ రొంగల, మోహన్ రావు వల్లూరి, కావేరి, మధు బాయ్, వాసు వర్మ, నాని తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి కో డైరెక్టర్ – నాని జంగాల, పిఆర్ఓ: కుమార్ స్వామి, మాటలు ,పాటలు – పెద్దాడ మూర్తి, సినిమాటోగ్రఫీ – వాసు వర్మ కఠారి, నిర్మాతలు – భరత్ పారేపల్లి , సుదీప్ మొక్కరాల, కధ-స్క్రీన్ ప్లే -దర్శకత్వం – భరత్ పారేపల్లి