9010892345 Whatsup moviepromotion.pro@gmail.com
Select Page

నరేన్ వనపర్తి, దీపాళి శర్మ నటించిన చిత్రం ‘ఊరికి ఉత్తరాన’. తన బృందంతో కలిసి సతీష్ దర్శకత్వం వహించారు. వనపర్తి వెంకటయ్య నిర్మించారు. ఈచిత్రం థియేటర్లలో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఈ సినిమా ప్రముఖ OTT సంస్థ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ సంద‌ర్భంగా నిర్మాత వ‌న‌ప‌ర్తి వెంకటయ్య మాట్లాడుతూ… మా చిత్రాన్ని థియేటర్లలో అదరించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇప్పుడు OTTలో స్ట్రీమింగ్ అవుతోంది. మంచి మెసేజ్ వున్న సినిమా అన్నారు.

ఈ సదర్భంగా దర్శకుడు మాట్లాడుతూ “గ్రామీణ నేపథ్యంలో సాగే కథ ఇది. ప్రేమతోపాటు, ఆసక్తి రేకెత్తించే అంశాలు పుష్కలంగా ఉన్నాయ”న్నారు. కథానాయకుడు నరేన్ మాట్లాడుతూ “ఈ సినిమా కోసం వరంగల్ సెట్ వేసి చిత్రీకరణ చేశాం. అది సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. మనసుల్ని హత్తుకునే కథ, కథనాలతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకి చక్కటి వినోదం పంచుతుంది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. కేవలం రూ.79 చెల్లించి ఈ సినిమా ఇంటిల్లపాది చూడొచ్చు. ప్రస్తుతం ఈగల్ ఐ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై ఓ కొత్త దర్శకుడితో ఓ సినిమా చేస్తున్నట్లు” తెలిపారు.

ఈ చిత్రంలో రామరాజు, మల్లేశం ఫేం ఆనంద చక్రపాణి, అంకిత్ కొయ్య, ఫణి, జగదీష్ లు ప్రధాన పాత్రల్లో న‌టిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీః శ్రీకాంత్ అరుపుల‌; సంగీతంః భీమ్స్ సిసిరోలియో- సురేష్ బొబ్బిలి; సాహిత్యంః సురేష్ గంగుల‌, పూర్ణాచారి; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : మాల్యా కందుకూరి ; నిర్మాతః వ‌న‌ప‌ర్తి వెంక‌ట‌య్య‌, ద‌ర్శ‌క‌త్వంః స‌తీష్ అండ్ టీమ్