9010892345 Whatsup moviepromotion.pro@gmail.com
Select Page

చిత్రం: ఆర్గానిక్ మామా హైబ్రిడ్ అల్లుడు
బ్యానర్: అమ్ము క్రియేషన్స్, కల్పన చిత్ర
తారాగణం: సోహెల్, మృణాళిని రవి, రాజేంద్ర ప్రసాద్, మీనా, వరుణ్ సందేశ్, రష్మీ, సునీల్, అలీ, అజయ్ ఘోష్, సప్తగిరి, ప్రవీణ్, పృధ్వి తదితరులు
సినిమాటోగ్రఫీ: C. రామ్ ప్రసాద్
ఎడిటర్: ప్రవీణ్ పూడి
యాక్షన్: వెంకట్, రియల్ సతీష్
కళ: శివ శ్రీరాముల
నిర్మాత: కోనేరు కల్పన
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, సంగీతం, దర్శకత్వం: SV కృష్ణా రెడ్డి
విడుదల తేదీ: మార్చి 03, 2023

తెలుగు సూపర్‌హిట్ దర్శకుడు ఎస్‌వి కృష్ణా రెడ్డి 9 ఏళ్ల విరామం తర్వాత ఆర్గానిక్ మామా హైబ్రిడ్ అల్లుడు సినిమాతో మరోమారు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బిగ్‌బాస్ సోహైల్, మృణాళిని రవి హీరోహీరోయిన్లుగా రాజేంద్ర ప్రసాద్, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు రాగా సినిమా ఎలా ఉందో చూద్దాం.

కథ:
విజయ్ (సోహెల్) ఫ్లాప్ సినిమాల డైరెక్టర్. ఎలా అయినా హిట్ సినిమా చేయాలని భావించే ఆయన కొండపల్లి బొమ్మలు చేసుకునే తన శిల్పి తల్లిదండ్రుల పోరు పడలేక ఆ కొండపల్లి బొమ్మలను అమ్మడం కోసం తన డైరెక్షన్ తెలివితేటలు వాడతాడు. ఆ క్రమంలో హాసిని (మృణాళిని రవి)ని ఒక ఫైవ్ స్టార్ హోటల్‌లో కలుస్తాడు. మొదటిచూపులోనే ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడతారు. ఈ సమయంలో, మునికొండ (సునీల్) అనే నిర్మాత విజయ్‌ని సంప్రదించి సినిమా అవకాశం ఇస్తాడు. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో, హాసిని తండ్రి వెంకటరమణ (రాజేంద్ర ప్రసాద్) తన కూతురి ప్రేమ వ్యవహారం గురించి తెలుసుకుంటాడు. విజయ్ కుటుంబం యొక్క ఆర్థిక స్థితి తమ ఆర్ధిక స్థితికి ఏమాత్రం సూట్ అవ్వదని చెబుతూ వెంకట్రమణ హాసిని, విజయ్ ల లవ్ కు అడ్డు పడతాడు. ఆ తరువాత ఏం జరిగింది? విజయ్ తన కొత్త సినిమాతో సక్సెస్ అయ్యాడా? వెంకట్రమణ తన కుమార్తెకు పెళ్లి ఎవరితో జరిపించాడు? చివరికి విజయ్, హాసిని ఏమయ్యారు? అనేది సినిమా కథ.

విశ్లేషణ:
చాలా కాలం తరువాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎస్‌.వి. కృష్ణారెడ్డి తనకు తెలిసిన ఫార్మెట్‌లో కథ రాసుకుని ఒక ఫ్యామిలీ డ్రామా మన ముందుకు తెచ్చారు. ఈ సినిమాలో కుటుంబ సంబంధాలు, కష్టాలు, సుఖాలు అన్నీ కనిపిస్తాయి. మధ్యతరగతి అబ్బాయి పెద్దింటి అమ్మాయిని ప్రేమించడం ఆ అమ్మాయిని ఎలా దక్కించుకున్నాడు అనేది ఈ సినిమా కథ. ఈ సినిమా ఫార్మాట్ లో ఎన్నో సినిమాలు వచ్చినా తనకు తెలిసిన విధంగా తీసి ఎస్‌.వి. కృష్ణారెడ్డి ఇప్పటి ట్రెండ్‌కు తగినట్లుగానే టైటిల్‌ పెట్టాడు. అందుకు తగినట్లుగా సన్నివేశాలు కూడా రాసుకున్న ఆయనప్రేక్షకుల్ని ఎంట్‌టైన్‌ చేసేవిధంగా లాజికల్ గా సన్నివేశాలు చూపించాడు. ఆయన దర్శకుడుగానే కాకుండా సంగీతం, మాటలు, స్క్రీన్‌ప్లే, పాటలుకూడా రాయడం విశేషం. ఇది కొత్త కథ కాకపోయినా ఆద్యంతం నవ్విస్తూ, ఆలోచింపచేస్తూ సాగింది. అలాగే వినడానికి పాటలు బాగానే వున్నాయి. మాటలు కూడా ఆకట్టుకున్నాయి.

ఇక నటీనటుల విషయానికి వస్తే హీరోగా సోహైల్‌ బాగానే చేశాడు. యాక్షన్‌ సీన్స్ కూడా చేయగలను అని నిరూపించుకున్నాడు. మృణాళిని ఓకే అనిపిస్తుంది. మిగిలిన నటీనటులు అందరూ పాత్రల పరిధి మేరకు నటించారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిగా అజయ్‌ ఘోష్‌ అతని అసిస్టెంట్‌గా ప్రవీణ్, హర్ష చెముడు వంటి వారు ఎంటర్‌టైన్‌ చేశారు.

ఫైనల్ గా కలలు కనడానికి ఎన్ని రాత్రులు ఉంటాయో.. వాటిని నిజం చేసుకోవడానికి అన్ని పగళ్లు ఉంటాయి అనే విషయాన్ని చెబుతూ ముగించిన తీరు అందరినీ ఆలోచింప చేస్తుంది. నవ్విస్తూనే ఆలోచింప చేస్తూ ఆకట్టుకుంటుంది.