9010892345 Whatsup moviepromotion.pro@gmail.com
Select Page

వేట అనే సినిమాతో P.Sriram (పి. శ్రీరామ్ ) కథానాయకుడిగా తొలి అడుగు వేయబోతున్నాడు. మంగళవారం ఈ సినిమా రిలీజ్ పోస్ట‌ర్‌ను నంద‌మూరి చైతన్య కృష్ణ రిలీజ్ చేశారు. న‌టుడిగా గ‌తంలో ప‌లు సినిమాలు చేశాడు శ్రీరామ్. వేట సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు.బి వి వి ఆర్ క్రియేషన్స్ పతాకంపై ఎ. హరిత నిర్మాత గా ఈ వేట చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి కిషోర్ శ్రీ క్రిష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో రిలీజ్ అయినటువంటి “సిందూరం ” సినిమాకి ఈయన రచయిత. ఈ చిత్రానికి కెమెరామన్ గా బాలు ఎబిసిడి , బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను అజయ్ పట్నాయక్ అందించారు ఈ చిత్రాన్ని చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు ఎన్నో సినిమాలను రిలీజ్ చేస్తూ నూతన దర్శకులను, నిర్మాతలను ప్రోత్సహిస్తున్న బి సి ని ఈటి ఓటిటి (BCINEET OTT) సంస్థ ద్వారా బి సిని ఈటి ఓటిటి (BCINEET OTT) తో పాటూ అమెజాన్ ప్రైమ్ ఓవర్సీస్ , ఎంఎక్స్ ప్లేయర్, హంగామా ప్లే, విఐ మూవీస్ & టీవీ , ఎం ఐ టీవీ, ఫైర్ స్టిక్ ఇలా బి సిని ఈటి ఓటిటి (BCINEET OTT) సంస్థతో అనుసంధానమైన మరిన్ని 20 ఓటిటి ప్లాట్ఫామ్ లలో ఉగాది కానుక గా రిలీజ్ చేస్తున్నట్లు బి సి ని ఈటి ఓటిటి(BCINEET OTT) సంస్థ అధినేత డీకే బోయపాటి మీడియాకు వెల్లడించారు.